Ippadi keṟamgaraadu yemta nemu seppinaanu

ఇప్పటి కెఱఁగరాదు యెంత నేము చెప్పినాను
Language

(॥పల్లవి॥)
ఇప్పటి కెఱఁగరాదు యెంత నేము చెప్పినాను
తప్పు నీపై మోచితేనే తలవంచేవుగాని

(॥ఇప్ప॥)
ఆపె చెప్పినమాటలట్టె తారుకాణవచ్చె
యేపున నాతో బాసలేల సేసేవు
ఆపనుల నీమోవి అద్దములోఁ జూడరాదా
నీపట్టుకు సిగ్గుపడి నిజమాడేవుగాని

(॥ఇప్ప॥)
అందరు నిన్నాడుకొనే వవి నేఁడు నిజమాయ
చెంది యమరించవేల చెల్లఁబెట్టేవు
సందడి నీచెక్కు లవి చమరి చూచుకోరాదా
అందపురేకలకు నీ వటు నవ్వేవుగాని

(॥ఇప్ప॥)
దొడ్డికాడిగొల్లెలదూరులు దిష్టములాయ
వొడ్డుకోనేల శ్రీవేంకటోత్తమ నీవు
జిడ్డు చూచుకోరాదా చెలెల మేలుమంగను
అడ్డము లే కేలితివి అట్టు మెచ్చేవుగాని

(||pallavi||)
ippaḍi kĕṟam̐garādu yĕṁta nemu sĕppinānu
tappu nībai mosidene talavaṁchevugāni

(||ippa||)
ābĕ sĕppinamāḍalaṭṭĕ tārugāṇavachchĕ
yebuna nādo bāsalela sesevu
ābanula nīmovi addamulom̐ jūḍarādā
nībaṭṭugu siggubaḍi nijamāḍevugāni

(||ippa||)
aṁdaru ninnāḍugŏne vavi nem̐ḍu nijamāya
sĕṁdi yamariṁchavela sĕllam̐bĕṭṭevu
saṁdaḍi nīsĕkku lavi samari sūsugorādā
aṁdaburegalagu nī vaḍu navvevugāni

(||ippa||)
dŏḍḍigāḍigŏllĕladūrulu diṣhṭamulāya
vŏḍḍugonela śhrīveṁkaḍottama nīvu
jiḍḍu sūsugorādā sĕlĕla melumaṁganu
aḍḍamu le kelidivi aṭṭu mĕchchevugāni