ఇప్పటి కేమైనాను యియ్యకొనవే
(॥పల్లవి॥)
ఇప్పటి కేమైనాను యియ్యకొనవే
చొప్పులన్నియును మారి సోదించేవే కదవే
(॥ఇప్ప॥)
సిగ్గులువడకువే చెలువుండు మాటాడఁగ
వొగ్గి యేమిటికైనా వూఁకొనవే
వెగ్గళించి యందేమైనా వెలుతులు గలిగితేను
యెగ్గుతో గేలిసేయవే ఇన్నియు వెనకను
(॥ఇప్ప॥)
కమ్మి వాపసులెంచకువే ఘనుఁడు నీతో నవ్వితే
యెమ్మెల కెందుకైనాను ఇచ్చగించవే
నెమ్మి నందులో నేమైనా నెరుసులు గలిగితేను
నెమ్మది గేలిసేయవే నిక్కుచు వెనకను
(॥ఇప్ప॥)
చింతలో లోఁగకువే శ్రీవేంకటేశుఁ డంటఁగ
చెంతలఁ గాఁగిటఁ గూడి సేవసేయవే
పొంతఁ గూడితి నందులో వింతేమి గలిగినాను
బంతినే గేలిసేయవే పచ్చిగా వెనకను
(||pallavi||)
ippaḍi kemainānu yiyyagŏnave
sŏppulanniyunu māri sodiṁcheve kadave
(||ippa||)
sigguluvaḍaguve sĕluvuṁḍu māḍāḍam̐ga
vŏggi yemiḍigainā vūm̐kŏnave
vĕggaḽiṁchi yaṁdemainā vĕludulu galigidenu
yĕggudo geliseyave inniyu vĕnaganu
(||ippa||)
kammi vābasulĕṁchaguve ghanum̐ḍu nīdo navvide
yĕmmĕla kĕṁdugainānu ichchagiṁchave
nĕmmi naṁdulo nemainā nĕrusulu galigidenu
nĕmmadi geliseyave nikkusu vĕnaganu
(||ippa||)
siṁtalo lom̐gaguve śhrīveṁkaḍeśhum̐ ḍaṁṭam̐ga
sĕṁtalam̐ gām̐giḍam̐ gūḍi sevaseyave
pŏṁtam̐ gūḍidi naṁdulo viṁtemi galiginānu
baṁtine geliseyave pachchigā vĕnaganu