ఇప్పడేల వేగిరించే వెంతలేదు నీ పగటు
(॥పల్లవి॥)
ఇప్పడేల వేగిరించే వెంతలేదు నీ పగటు
కప్పరమువాసన లేకడనైనా దాఁగునా
(॥ఇప్ప॥)
మందలించి నీ యెమ్మెలు మాతో నాడవద్దుగాని
చెంది యాతనితోడనే చెప్పవే నీవు
అందరి ముందరాఁ బంతా లవి యాల నెరపేవే
కందువ నీపతివద్దఁ గానవచ్చీఁ గాక
(॥ఇప్ప॥)
వాడలోన నీరూపు వర్ణించుకోవద్దుగాని
సూడిదెగా నాతనికే చూనవే నీవు
వీడెవు మోవి సారెకు విచ్చి యేల నవ్వేవే
వేడుక నీపతివద్ద వెలవెట్టీఁగాక
(॥ఇప్ప॥)
నేరుపు లెక్కడనైనా నెరపఁగ వద్దుగాని
నీరచన లాతనిపై నించవే నీవు
యీరీతి శ్రీవేంకటేశుఁ డేలె నన్ను నేమనేవే
కోరిక నీపతివద్ద గొనసాగీఁ గాక
(||pallavi||)
ippaḍela vegiriṁche vĕṁtaledu nī pagaḍu
kapparamuvāsana legaḍanainā dām̐gunā
(||ippa||)
maṁdaliṁchi nī yĕmmĕlu mādo nāḍavaddugāni
sĕṁdi yādanidoḍane sĕppave nīvu
aṁdari muṁdarām̐ baṁtā lavi yāla nĕrabeve
kaṁduva nībadivaddam̐ gānavachchīm̐ gāga
(||ippa||)
vāḍalona nīrūbu varṇiṁchugovaddugāni
sūḍidĕgā nādanige sūnave nīvu
vīḍĕvu movi sārĕgu vichchi yela navveve
veḍuga nībadivadda vĕlavĕṭṭīm̐gāga
(||ippa||)
nerubu lĕkkaḍanainā nĕrabam̐ga vaddugāni
nīrasana lādanibai niṁchave nīvu
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nannu nemaneve
koriga nībadivadda gŏnasāgīm̐ gāga