ఇప్పడే విన్నవించితి మిదిగో నీకు
(॥పల్లవి॥)
ఇప్పడే విన్నవించితి మిదిగో నీకు
తప్పక మా లాగు లివి తలఁచుకోవయ్యా
(॥ఇప్ప॥)
చూపులకొనల నుండు చొక్కులు మాకు
తీపులమోవిపైఁ గారు తేనియలు
పూపచన్నులంటిమా పుట్టుఁగొండలు
వోపితేనే మాపొందుల కొడిగట్టవయ్యా
(॥ఇప్ప॥)
సరుస బొమ్మలనుండు జంకెనలు
తురుమ వట్టతే రేఁగుఁ దుమ్మిదలు
గరిమఁ గొనగోరులు కడువాఁడులు
మరుగ వలసితేను మావద్దికి రావయ్యా
(॥ఇప్ప॥)
నాలిక తుదలనుండు నయగారాలు
పోలించితే నిలువునఁ బుట్టించునాన
యేలితివి శ్రీవేంకటేశుఁడు నన్ను
యీలాగులు యితవైతే నిట్టెమన్నించవయ్యా
(||pallavi||)
ippaḍe vinnaviṁchidi midigo nīgu
tappaga mā lāgu livi talam̐sugovayyā
(||ippa||)
sūbulagŏnala nuṁḍu sŏkkulu māgu
tībulamovibaim̐ gāru teniyalu
pūbasannulaṁṭimā puṭṭum̐gŏṁḍalu
vobidene mābŏṁdula kŏḍigaṭṭavayyā
(||ippa||)
sarusa bŏmmalanuṁḍu jaṁkĕnalu
turuma vaṭṭade rem̐gum̐ dummidalu
garimam̐ gŏnagorulu kaḍuvām̐ḍulu
maruga valasidenu māvaddigi rāvayyā
(||ippa||)
nāliga tudalanuṁḍu nayagārālu
poliṁchide niluvunam̐ buṭṭiṁchunāna
yelidivi śhrīveṁkaḍeśhum̐ḍu nannu
yīlāgulu yidavaide niṭṭĕmanniṁchavayyā