ఇప్పడే చెప్పితి నీకు నెఱుకగా బుద్దులెల్లా
(॥పల్లవి॥)
ఇప్పడే చెప్పితి నీకు నెఱుకగా బుద్దులెల్లా
చిప్పిలఁ బెనఁగేవేళ సిగ్గులు వడకువే
(॥ఇప్ప॥)
మగఁడు లాలించితేను మాఁటలెల్లా నాడవే
మొగము చూచితేను మొక్కవే నీవు
నగితే నాతనితోడ ననుపు సేసుకొనవే
జిగిఁ గూడే రతివేళ సిగ్గులు వడకువే
(॥ఇప్ప॥)
పిలిచితేనే పలికి ప్రియములు చెప్పవే
తలఁచినప్పడే మతిఁ దమిరేఁడవే
యెలమి సన్నచేసితే నిచ్చలో మెలఁగవే
చెలరేఁగి పైకొంటేను సిగ్గులు వడకువే
(॥ఇప్ప॥)
పరపుపైఁ గూచుండితే పాదాలు నీవొత్తవే
గరిమ నాసపడితేఁ గాఁగిలించవే
యిరవై శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁ గూడె
శిరసెత్తి వేఁడుకొంటే సిగ్గులు వడకునే
(||pallavi||)
ippaḍe sĕppidi nīgu nĕṟugagā buddulĕllā
sippilam̐ bĕnam̐geveḽa siggulu vaḍaguve
(||ippa||)
magam̐ḍu lāliṁchidenu mām̐ṭalĕllā nāḍave
mŏgamu sūsidenu mŏkkave nīvu
nagide nādanidoḍa nanubu sesugŏnave
jigim̐ gūḍe radiveḽa siggulu vaḍaguve
(||ippa||)
pilisidene paligi priyamulu sĕppave
talam̐sinappaḍe madim̐ damirem̐ḍave
yĕlami sannaseside nichchalo mĕlam̐gave
sĕlarem̐gi paigŏṁṭenu siggulu vaḍaguve
(||ippa||)
parabubaim̐ gūsuṁḍide pādālu nīvŏttave
garima nāsabaḍidem̐ gām̐giliṁchave
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐ gūḍĕ
śhirasĕtti vem̐ḍugŏṁṭe siggulu vaḍagune