Ippadanumtiyu nela yeravu seyagu vamma

ఇప్పటనుంటియు నేల యెరవు సేయకు వమ్మ
Language

(॥పల్లవి॥)
ఇప్పటనుంటియు నేల యెరవు సేయకు వమ్మ
తప్పు లెల్ల వొప్పులుగా దగఁ జేసేఁ గాని

(॥ఇప్పట॥)
మచ్చిక నీ మాటతఁడు మన సొగ్గి వినీ నదె
విచ్చనవిడిని విన్నవించ వమ్మా
చెచ్చెర యీవేళ నీకుఁ జెల్లి నంతాఁ జేయవమ్మ
మచ్చరపు మా సుద్దులు మరి చేప్పేఁ గాని

(॥ఇప్పట॥)
నెలవై నాయకుఁడదె నీవంక చూచీని
సొలసి చక్కఁదనాలు చూపవమ్మా
బలి మెంత గలిగినాఁ బచరించవమ్మ యిట్టె
చలము వెనక నేనె సాదించేగాని

(॥ఇప్పట॥)
చేయి చాఁచి నీమీఁద జెనకేననీ యాతఁడు
ఆయ మెరిఁగి సరసా లాడవమ్మా
యీయెడ శ్రీవెంటేశుఁ డింత సేసి నిన్ను గూడె
చాయ లేల సన్న లేలసంత మయ్యేఁ గాని

(||pallavi||)
ippaḍanuṁṭiyu nela yĕravu seyagu vamma
tappu lĕlla vŏppulugā dagam̐ jesem̐ gāni

(||ippaḍa||)
machchiga nī māḍadam̐ḍu mana sŏggi vinī nadĕ
vichchanaviḍini vinnaviṁcha vammā
sĕchchĕra yīveḽa nīgum̐ jĕlli naṁtām̐ jeyavamma
machcharabu mā suddulu mari seppem̐ gāni

(||ippaḍa||)
nĕlavai nāyagum̐ḍadĕ nīvaṁka sūsīni
sŏlasi sakkam̐danālu sūbavammā
bali mĕṁta galiginām̐ basariṁchavamma yiṭṭĕ
salamu vĕnaga nenĕ sādiṁchegāni

(||ippaḍa||)
seyi sām̐si nīmīm̐da jĕnagenanī yādam̐ḍu
āya mĕrim̐gi sarasā lāḍavammā
yīyĕḍa śhrīvĕṁṭeśhum̐ ḍiṁta sesi ninnu gūḍĕ
sāya lela sanna lelasaṁta mayyem̐ gāni