Ippadanumtinela yedamaada kaaneegaanee

ఇప్పటనుంటినేల యెడమాట కానీకానీ
Language

(॥పల్లవి॥)
ఇప్పటనుంటినేల యెడమాట కానీకానీ
ముప్పిరి నే నవ్వితేఁ గా మొగకళ లెక్కుత

(॥ఇప్ప॥)
పొలసి పొలసి లోఁగి పొంచి పొంచి తలవంచి
సెలసి సెలసి తాను చిమ్మీగోర
అలసి సొలసి యిప్పు డాడనేల తాను నేను
కలసినప్పుడుగదా కడమలు నిండుత

(॥ఇప్ప॥)
జునిఁగి జునిఁగి లేచి మునిఁగి మునిఁగి యేసి
పెనఁగి పెనఁగి పాసి ప్రేమ చల్లీని
పొనిఁగి పొనిఁగి తన్ను బోదించనేల నేను
పెనఁగినప్పుడుగదా బిరుదు వొగడుత

(॥ఇప్ప॥)
మానిమాని కరఁగీని మగుడ కాలుఁ దొక్కి
ఆనని శ్రీవేంకటేశుఁ డంతలో నిదె
కోనకోనచన్నులపైఁ గొంక కిట్టె చేయివేసీ
నానినవలపులఁగా నానాఁట మెచ్చుట

(||pallavi||)
ippaḍanuṁṭinela yĕḍamāḍa kānīgānī
muppiri ne navvidem̐ gā mŏgagaḽa lĕkkuda

(||ippa||)
pŏlasi pŏlasi lom̐gi pŏṁchi pŏṁchi talavaṁchi
sĕlasi sĕlasi tānu simmīgora
alasi sŏlasi yippu ḍāḍanela tānu nenu
kalasinappuḍugadā kaḍamalu niṁḍuda

(||ippa||)
junim̐gi junim̐gi lesi munim̐gi munim̐gi yesi
pĕnam̐gi pĕnam̐gi pāsi prema sallīni
pŏnim̐gi pŏnim̐gi tannu bodiṁchanela nenu
pĕnam̐ginappuḍugadā birudu vŏgaḍuda

(||ippa||)
mānimāni karam̐gīni maguḍa kālum̐ dŏkki
ānani śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalo nidĕ
konagonasannulabaim̐ gŏṁka kiṭṭĕ seyivesī
nāninavalabulam̐gā nānām̐ṭa mĕchchuḍa