ఇప్పటనుండియు నిన్ను ఇంతేసి దూరఁగనేల
(॥పల్లవి॥)
ఇప్పటనుండియు నిన్ను ఇంతేసి దూరఁగనేల
చెప్పనేల నీవేమైనాఁ జేయవయ్య చేఁతలు
(॥ఇప్ప॥)
వెంగెము లాడినఁగాక వెరచేవా సతులకు
అంగము సోఁకినగాక అలసేవా
కొంగువట్టితేఁగాక కొసరుకు లోనయ్యేవా
చెంగట నేమైనా నీవు సేయవయ్యా చేఁతలు
(॥ఇప్ప॥)
కన్నులనుఁ దిట్టననుఁగాక కడుఁ గరఁగేవా
చన్నుల నొత్తినఁగాక సమ్మతించేవా
చిన్ని గో రూఁదినఁగాక చేతికి వసమయ్యేవా
చెన్నుమీర నేమైనాఁ జేయవయ్యా చేఁతలు
(॥ఇప్ప॥)
కాలు దొక్కితేఁగాక కాఁగిట నీవు గూడేవా
కేలు పైఁజాఁచిన గాక కిందుపడేవా
యీలీల శ్రీవేంకటేశ యేలితివి నను నేఁడు
చేల కొంగిచ్చి యేమైనఁ జేయవయ్య చేఁతలు
(||pallavi||)
ippaḍanuṁḍiyu ninnu iṁtesi dūram̐ganela
sĕppanela nīvemainām̐ jeyavayya sem̐talu
(||ippa||)
vĕṁgĕmu lāḍinam̐gāga vĕrasevā sadulagu
aṁgamu som̐kinagāga alasevā
kŏṁguvaṭṭidem̐gāga kŏsarugu lonayyevā
sĕṁgaḍa nemainā nīvu seyavayyā sem̐talu
(||ippa||)
kannulanum̐ diṭṭananum̐gāga kaḍum̐ garam̐gevā
sannula nŏttinam̐gāga sammadiṁchevā
sinni go rūm̐dinam̐gāga sedigi vasamayyevā
sĕnnumīra nemainām̐ jeyavayyā sem̐talu
(||ippa||)
kālu dŏkkidem̐gāga kām̐giḍa nīvu gūḍevā
kelu paim̐jām̐sina gāga kiṁdubaḍevā
yīlīla śhrīveṁkaḍeśha yelidivi nanu nem̐ḍu
sela kŏṁgichchi yemainam̐ jeyavayya sem̐talu