(॥పల్లవి॥)
ఇప్పటనుండి మాటలేల నీతోను
తప్పు మోపకుండితేను తారుకాణించరాదా
(॥ఇప్ప॥)
సన్నలనే నీగుణము చాయకుఁ దేకుండితేను
నన్నుఁజూచి నీ వప్పుడు నగరాదా
చిన్ననాటి నా పంతాలు చెల్లించుకోకుండితేను
వున్నతితోఁ బెట్టరాని వొట్టు వెట్టరాదా
(॥ఇప్ప॥)
చుట్టరికాననే నిన్ను సూడు వట్ట కుండితేను
అట్టే నన్ను యెగసక్కే లాడరాదా
రట్టు సేసి నిన్నింటికి ఇట్టె రప్పించకుండితే
పట్టిన చలాన సిగ్గుపరచఁగరాదా
(॥ఇప్ప॥)
పచ్చిగా రతులఁ గిందుపడఁ జేయకుండితేను
కచ్చుపెట్టి మరి నీవు కాదనరాదా
ఇచ్చట శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
మచ్చికలు చూపి నాతో మారుకొనరాదా
(||pallavi||)
ippaḍanuṁḍi māḍalela nīdonu
tappu mobaguṁḍidenu tārugāṇiṁcharādā
(||ippa||)
sannalane nīguṇamu sāyagum̐ deguṁḍidenu
nannum̐jūsi nī vappuḍu nagarādā
sinnanāḍi nā paṁtālu sĕlliṁchugoguṁḍidenu
vunnadidom̐ bĕṭṭarāni vŏṭṭu vĕṭṭarādā
(||ippa||)
suṭṭarigānane ninnu sūḍu vaṭṭa kuṁḍidenu
aṭṭe nannu yĕgasakke lāḍarādā
raṭṭu sesi ninniṁṭigi iṭṭĕ rappiṁchaguṁḍide
paṭṭina salāna siggubarasam̐garādā
(||ippa||)
pachchigā radulam̐ giṁdubaḍam̐ jeyaguṁḍidenu
kachchubĕṭṭi mari nīvu kādanarādā
ichchaḍa śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
machchigalu sūbi nādo mārugŏnarādā