ఇప్పట నుండియు నీతో నింత యేలరా । నా
(॥పల్లవి॥)
ఇప్పట నుండియు నీతో నింత యేలరా । నా-
తిప్పరాని చేఁతలందే తేటపడీఁగాక
(॥ఇప్ప॥)
నీ వేమిసేతువుర నిన్నుఁ జూచి యాడలేని -
యీవల నామొగమోట మింతసేయఁగా
కోవరపునామనసు కోపము మించినప్పుడు
కావలసినపనులు గానుపించీఁగాక
(॥ఇప్ప॥)
తప్పేమీ నీవంకఁ దలరా నీతో నలిగి
యప్పటి మాటాడేనా యాసలుగాక
యెప్పటికి నింతయేల ఇద్దరి మనలోలోని-
చిప్పిలుఁగాఁకలే బుద్దిచెప్పీ నింతేకాక
(॥ఇప్ప॥)
ఇందులో నీకడమేది ఇట్టె నిన్నుఁ బైకొని నే
ముందు నిన్నుఁ జెనకనిమోసముగాక
విందుగా శ్రీవేంకటేశ వింత నీనాకూటమికిఁ
జందమైన గురుతులే సాకిరయ్యీఁగాక
(||pallavi||)
ippaḍa nuṁḍiyu nīdo niṁta yelarā | nā-
tipparāni sem̐talaṁde teḍabaḍīm̐gāga
(||ippa||)
nī vemiseduvura ninnum̐ jūsi yāḍaleni -
yīvala nāmŏgamoḍa miṁtaseyam̐gā
kovarabunāmanasu kobamu miṁchinappuḍu
kāvalasinabanulu gānubiṁchīm̐gāga
(||ippa||)
tappemī nīvaṁkam̐ dalarā nīdo naligi
yappaḍi māḍāḍenā yāsalugāga
yĕppaḍigi niṁtayela iddari manaloloni-
sippilum̐gām̐kale buddisĕppī niṁtegāga
(||ippa||)
iṁdulo nīgaḍamedi iṭṭĕ ninnum̐ baigŏni ne
muṁdu ninnum̐ jĕnaganimosamugāga
viṁdugā śhrīveṁkaḍeśha viṁta nīnāgūḍamigim̐
jaṁdamaina gurudule sāgirayyīm̐gāga