Inumamta panigim gaa nemta sesevu

ఇనుమంత పనికిఁ గా నెంత సేసేవు
Language

(॥పల్లవి॥)
ఇనుమంత పనికిఁ గా నెంత సేసేవు
విసు పేల వచ్చె నీకు వినవయ్య మాఁటా

(॥ఇమంత॥)
తూఁగుమంచ మెక్కుకొని తొయ్యలి లేవ దంటా
తోఁగి చూచి నీవు వోఁగా దొడికి పట్టి
వేఁ గగు కుచభారము వీడఁగాఁ బెనఁగీ నాపె
వీఁగక మన్నించి నేఁడు వినవయ్య మాఁటా

(॥ఇమంత॥)
తామెర నాపె వేయఁగఁ దాఁకి నీకు నొచ్చె నంటా
వోమి నీవు కళ వట్టి వూర కుండఁగా
మోము చిన్నఁబోయి యింతి మోవితేనె నీకు నిచ్చి
వేమారు వేఁడుకొనీని వినవయ్య మాఁటా

(॥ఇమంత॥)
సిగ్గుతో నున్నది యంటా శ్రీవెంకటేశుఁడ నీవు
బగ్గన నవ్వలిమో మై పవ్వళించఁగా
దగ్గరి యందుకే యింతి తమకించి నిన్నుఁ గూడె
వెగ్గళించ కిపు డిట్టె వినవయ్య మాఁటా

(||pallavi||)
inumaṁta panigim̐ gā nĕṁta sesevu
visu pela vachchĕ nīgu vinavayya mām̐ṭā

(||imaṁta||)
tūm̐gumaṁcha mĕkkugŏni tŏyyali leva daṁṭā
tom̐gi sūsi nīvu vom̐gā dŏḍigi paṭṭi
vem̐ gagu kusabhāramu vīḍam̐gām̐ bĕnam̐gī nābĕ
vīm̐gaga manniṁchi nem̐ḍu vinavayya mām̐ṭā

(||imaṁta||)
tāmĕra nābĕ veyam̐gam̐ dām̐ki nīgu nŏchchĕ naṁṭā
vomi nīvu kaḽa vaṭṭi vūra kuṁḍam̐gā
momu sinnam̐boyi yiṁti movidenĕ nīgu nichchi
vemāru vem̐ḍugŏnīni vinavayya mām̐ṭā

(||imaṁta||)
siggudo nunnadi yaṁṭā śhrīvĕṁkaḍeśhum̐ḍa nīvu
baggana navvalimo mai pavvaḽiṁcham̐gā
daggari yaṁduge yiṁti tamagiṁchi ninnum̐ gūḍĕ
vĕggaḽiṁcha kibu ḍiṭṭĕ vinavayya mām̐ṭā