Inniyunum gaanavachche nimduvamkane

ఇన్నియునుఁ గానవచ్చె నిందువంకనే
Language

(॥పల్లవి॥)
ఇన్నియునుఁ గానవచ్చె నిందువంకనే
సంగడి(సన్నల?) నింతక నీవు సంగడిఁ గూచుండవా

(॥ఇన్ని॥)
తగులు గల వాఁడవు తమకించవలెఁగాక
చిగురుఁ బెదవిమీఁది సిగ్గులేల
జిగి నీవే యేమిగల్ల సేసివున్నాఁడవో కాక
పగటున నింత కిట్టె పై కొనిదగ్గరవా

(॥ఇన్ని॥)
ప్రేమముగలవాఁడవు పెనఁగఁగవలెఁగాక
నేమముతోడుత వట్టినీటులేల
యేమగువకును బాస ఇచ్చివున్నాఁడవోకాక
దోమటి నింతక కాలుదొక్కవా నీవు

(॥ఇన్ని॥)
చుట్టమవైనవాఁడవు చొచ్చి కూడవలెఁగాక
పట్టినకొంగుతో నొడఁబరచనేల
యిట్టె శ్రీ వేంకటేశ యెరిఁగి కూడితిగాక
గుట్టున నింతక బుసకొట్టుల నలయవా

(||pallavi||)
inniyunum̐ gānavachchĕ niṁduvaṁkane
saṁgaḍi(sannala?) niṁtaga nīvu saṁgaḍim̐ gūsuṁḍavā

(||inni||)
tagulu gala vām̐ḍavu tamagiṁchavalĕm̐gāga
sigurum̐ bĕdavimīm̐di siggulela
jigi nīve yemigalla sesivunnām̐ḍavo kāga
pagaḍuna niṁta kiṭṭĕ pai kŏnidaggaravā

(||inni||)
premamugalavām̐ḍavu pĕnam̐gam̐gavalĕm̐gāga
nemamudoḍuda vaṭṭinīḍulela
yemaguvagunu bāsa ichchivunnām̐ḍavogāga
domaḍi niṁtaga kāludŏkkavā nīvu

(||inni||)
suṭṭamavainavām̐ḍavu sŏchchi kūḍavalĕm̐gāga
paṭṭinagŏṁgudo nŏḍam̐barasanela
yiṭṭĕ śhrī veṁkaḍeśha yĕrim̐gi kūḍidigāga
guṭṭuna niṁtaga busagŏṭṭula nalayavā