ఇన్నియును నాయెఁ బోయె యిందుకా నేను
(॥పల్లవి॥)
ఇన్నియును నాయెఁ బోయె యిందుకా నేను
వెన్నెలలో విరహపు వేదనకా నేను
(॥ఇన్ని॥)
పిలువ వచ్చేవు నీ ప్రియురాండ్ల చేతి
వులివచ్చి మాట లోర్చి యుండనా సేను
పలుక వచ్చేవు నాతో పలుమారు నీ వాడే
చలివేఁడి సటలకు సాకిరా నేను
(॥ఇన్ని॥)
పట్టఁ జూచేవు బలిమి పడఁతుల బొంది పొంది
వెట్టయిన నీ మేని వేఁడికా నేను
చుట్టమవై దగ్గరేవు సొరిది నీ వొక మాటు
ముట్టిన దేవుళ్ళలోని మూఁకకా నేను
(॥ఇన్ని॥)
నగవచ్చేవు నాతోను నాలిసేసి వేగినంతా
వెగటు జాగరమున వీఁగనా నేను
నిగిడి శ్రీవేంకటేశ నీవు నన్నుఁ గూడితివి
మొగము చూచి చూచి మొక్కనా నేను
(||pallavi||)
inniyunu nāyĕm̐ boyĕ yiṁdugā nenu
vĕnnĕlalo virahabu vedanagā nenu
(||inni||)
piluva vachchevu nī priyurāṁḍla sedi
vulivachchi māḍa lorsi yuṁḍanā senu
paluga vachchevu nādo palumāru nī vāḍe
salivem̐ḍi saḍalagu sāgirā nenu
(||inni||)
paṭṭam̐ jūsevu balimi paḍam̐tula bŏṁdi pŏṁdi
vĕṭṭayina nī meni vem̐ḍigā nenu
suṭṭamavai daggarevu sŏridi nī vŏga māḍu
muṭṭina devuḽḽaloni mūm̐kagā nenu
(||inni||)
nagavachchevu nādonu nālisesi veginaṁtā
vĕgaḍu jāgaramuna vīm̐ganā nenu
nigiḍi śhrīveṁkaḍeśha nīvu nannum̐ gūḍidivi
mŏgamu sūsi sūsi mŏkkanā nenu