ఇన్నియును దగఁగలిగె నీయింతి కిదె యిపుడు
(॥పల్లవి॥)
ఇన్నియును దగఁగలిగె నీయింతి కిదె యిపుడు
కన్నియల కిందరికిఁ గలిగె మోహములూ
(॥ఇన్ని॥)
నిగనిగని మెఱుఁగు వెన్నెల మోమునకుఁ గలిగె
చిగురుమోవికిఁ గలిగెఁ జిఱునగవులు
పగటుఁగనుఁగొనలఁ బలపలని కెంపులు గలిగె
పొగరుఁజెమటలు గలిగె పొలఁతిచెక్కులను
(॥ఇన్ని॥)
ఒయ్యార మగు నలపు లువిదమేనికిఁ గలిగె
గయ్యాళి నడపులకుఁ గలిగె మురిపెములు
తొయ్యలికిఁ గలిగె సంతోషంపుఁ బరవశము
పయ్యెదకుఁ గలిగెఁ బయిపైని నునుఁబూఁత
(॥ఇన్ని॥)
వెలఁది కిప్పుడు గలిగె వేంకటేశ్వరు కరుణ
తలఁపులకుఁ గలిగె చింతా వియోగంబు
పులకలకుఁ గలిగెఁ దలఁపులలోని జొంపములు
అలుకలకుఁ గలిగెఁ బాయని విలాసములు
(||pallavi||)
inniyunu dagam̐galigĕ nīyiṁti kidĕ yibuḍu
kanniyala kiṁdarigim̐ galigĕ mohamulū
(||inni||)
niganigani mĕṟum̐gu vĕnnĕla momunagum̐ galigĕ
sigurumovigim̐ galigĕm̐ jiṟunagavulu
pagaḍum̐ganum̐gŏnalam̐ balabalani kĕṁpulu galigĕ
pŏgarum̐jĕmaḍalu galigĕ pŏlam̐tisĕkkulanu
(||inni||)
ŏyyāra magu nalabu luvidamenigim̐ galigĕ
gayyāḽi naḍabulagum̐ galigĕ muribĕmulu
tŏyyaligim̐ galigĕ saṁtoṣhaṁpum̐ baravaśhamu
payyĕdagum̐ galigĕm̐ bayibaini nunum̐būm̐ta
(||inni||)
vĕlam̐di kippuḍu galigĕ veṁkaḍeśhvaru karuṇa
talam̐pulagum̐ galigĕ siṁtā viyogaṁbu
pulagalagum̐ galigĕm̐ dalam̐pulaloni jŏṁpamulu
alugalagum̐ galigĕm̐ bāyani vilāsamulu