Inniyum goodenu yimtigini

ఇన్నియుఁ గూడెను యింతికిని
Language

(॥పల్లవి॥)
ఇన్నియుఁ గూడెను యింతికిని
నిన్నటి మాఁటలు నిజపొంతువులు

(॥ఇన్ని॥)
పులకల మొలకలవున్న మనాఁడే
తలిరుఁబోఁడికినిఁ దలఁబాలు
సొలపులనగవుల సోమవారమునఁ
గలయురతుల కంకణదారములు

(॥ఇన్ని॥)
ననుపుగ చిత్తానక్షత్రంబున
వినుకలిఁ బెట్టినవీడెములు
పనివడి చెలి సౌభాగ్యయోగమున
కొనచూపులకొంగుముడిసిరులు

(॥ఇన్ని॥)
మిక్కిలికూటపుమిథునలగ్నమున
తొక్కేటిపాదపుదోమట్లు
గక్కన శ్రీవేంకటపతిచెనకులు
వొక్కట నెదరినవుంకువలు

(||pallavi||)
inniyum̐ gūḍĕnu yiṁtigini
ninnaḍi mām̐ṭalu nijabŏṁtuvulu

(||inni||)
pulagala mŏlagalavunna manām̐ḍe
talirum̐bom̐ḍiginim̐ dalam̐bālu
sŏlabulanagavula somavāramunam̐
galayuradula kaṁkaṇadāramulu

(||inni||)
nanubuga sittānakṣhatraṁbuna
vinugalim̐ bĕṭṭinavīḍĕmulu
panivaḍi sĕli saubhāgyayogamuna
kŏnasūbulagŏṁgumuḍisirulu

(||inni||)
mikkiligūḍabumithunalagnamuna
tŏkkeḍibādabudomaṭlu
gakkana śhrīveṁkaḍabadisĕnagulu
vŏkkaḍa nĕdarinavuṁkuvalu