ఇన్నియుఁ గన్నవే కావా యిఁక నేటికే
(॥పల్లవి॥)
ఇన్నియుఁ గన్నవే కావా యిఁక నేటికే
పున్నమవెన్నెల పండి పొల్లపొయ్యీనా
(॥ఇన్ని॥)
యెన్నరానికాఁకతోడ నిప్నటినీచలములు
ఇన్నియుఁ జూతముగాక యెందువోయేనే
నిన్నఁ గుప్ప కోపములు నేఁ డాళ్లింతే గాక
యెన్నటివే కావా మీహృదయములు
(॥ఇన్ని॥)
విందువలె నామాట వినక సేసేచేఁత
కందము గాక నేనెక్కడ వోయేనే
ముందటికన్నులకంటే మొనవాండ్లైనచన్ను-
లందమాయఁగాక చూపు లప్పటివే కావా
(॥ఇన్ని॥)
వేఁడివేఁడిరతుల శ్రీవేంకటేశ్వరుఁ గూడి
యేడు నిమిషము దోఁచె నిదిగదవే
నేఁడే పెండ్లి నీకు నేఁడే నాగవల్లి
పోఁడిమాయ మీలోని భోగములు
(||pallavi||)
inniyum̐ gannave kāvā yim̐ka neḍige
punnamavĕnnĕla paṁḍi pŏllabŏyyīnā
(||inni||)
yĕnnarānigām̐kadoḍa nipnaḍinīsalamulu
inniyum̐ jūdamugāga yĕṁduvoyene
ninnam̐ guppa kobamulu nem̐ ḍāḽliṁte gāga
yĕnnaḍive kāvā mīhṛdayamulu
(||inni||)
viṁduvalĕ nāmāḍa vinaga sesesem̐ta
kaṁdamu gāga nenĕkkaḍa voyene
muṁdaḍigannulagaṁṭe mŏnavāṁḍlainasannu-
laṁdamāyam̐gāga sūbu lappaḍive kāvā
(||inni||)
vem̐ḍivem̐ḍiradula śhrīveṁkaḍeśhvarum̐ gūḍi
yeḍu nimiṣhamu dom̐sĕ nidigadave
nem̐ḍe pĕṁḍli nīgu nem̐ḍe nāgavalli
pom̐ḍimāya mīloni bhogamulu