ఇన్నియుఁ గలుగు టేజన్మముననైనఁ
(॥పల్లవి॥)
ఇన్నియుఁ గలుగు టేజన్మముననైనఁ
జెన్నలర హరిసేవ సిద్ధించుకొరకు
(॥ఇన్ని॥)
అరయ వేదాధ్యయన మది బ్రహ్మశుద్దికొర-
కిరవైనశాస్త్రంబు లెరుకకొరకు
తరి యజ్ఞములు రుణోత్తారమయ్యెడికొరకు
సరిలేనిదానములు జన్మములకొరకు
(॥ఇన్ని॥)
మమకారదూరంబు మనసు గెలుచుటకొరకు
సమవివేకంబు శాంతములకొరకు
అమరశ్రీతిరువేంకటాధ్రీశుమనసు నీ-
జముగెలుచు బ్రహ్మవిజ్ఞానంబుకొరకు
(||pallavi||)
inniyum̐ galugu ṭejanmamunanainam̐
jĕnnalara hariseva siddhiṁchugŏragu
(||inni||)
araya vedādhyayana madi brahmaśhuddigŏra-
kiravainaśhāstraṁbu lĕrugagŏragu
tari yajñamulu ruṇottāramayyĕḍigŏragu
sarilenidānamulu janmamulagŏragu
(||inni||)
mamagāradūraṁbu manasu gĕlusuḍagŏragu
samavivegaṁbu śhāṁtamulagŏragu
amaraśhrīdiruveṁkaḍādhrīśhumanasu nī-
jamugĕlusu brahmavijñānaṁbugŏragu