Inniyum deliyam jeppe nemamtaa numduvo neevu

ఇన్నియుఁ దెలియఁ జెప్పే నేమంటా నుందువో నీవు
Language

(॥పల్లవి॥)
ఇన్నియుఁ దెలియఁ జెప్పే నేమంటా నుందువో నీవు
తిన్నని తమితో నీకె తిమురుతా నున్నది

(॥॥)
తప్పక చూచి చెలి తలవంచుకొనెఁ గాని
దప్పిదేర నీ రూపు తలపోయుచున్నది
చిప్పిల నూరక నీతో సిగ్గున నున్నది గాని
కప్పురము వలె లోలోఁ గరఁగుతా నున్నది

(॥॥)
నెమ్మి నొక్కమాటే యాడె నీతో మరి మానెఁగాని
కొమ్మ భావములో నిన్నుఁ గొసరుతా నున్నది
నిమ్మపండు గాను కిచ్చి నిలుచుకున్నది గాని
ముమ్మారూ మతి లోనే మొక్కుతా నీ కున్నది

(॥॥)
పక్కన నీతో నవ్వి భ్రమసి వున్నది గాని
చిక్కించు కాతుమ నిన్నుఁ జెనకుతా నున్నది
యిక్కువ శ్రీ వేంకటేశ యెనసితి విట్టే నీవు
గక్కన బిగ్గి నిన్నుఁ గౌఁగిలించుకున్నది

(||pallavi||)
inniyum̐ dĕliyam̐ jĕppe nemaṁṭā nuṁduvo nīvu
tinnani tamido nīgĕ timurudā nunnadi

(||||)
tappaga sūsi sĕli talavaṁchugŏnĕm̐ gāni
dappidera nī rūbu talaboyusunnadi
sippila nūraga nīdo sigguna nunnadi gāni
kappuramu valĕ lolom̐ garam̐gudā nunnadi

(||||)
nĕmmi nŏkkamāḍe yāḍĕ nīdo mari mānĕm̐gāni
kŏmma bhāvamulo ninnum̐ gŏsarudā nunnadi
nimmabaṁḍu gānu kichchi nilusugunnadi gāni
mummārū madi lone mŏkkudā nī kunnadi

(||||)
pakkana nīdo navvi bhramasi vunnadi gāni
sikkiṁchu kāduma ninnum̐ jĕnagudā nunnadi
yikkuva śhrī veṁkaḍeśha yĕnasidi viṭṭe nīvu
gakkana biggi ninnum̐ gaum̐giliṁchugunnadi