Inniyum daane yerumgu nemanene

ఇన్నియుఁ దానే యెరుఁగు నేమనేనే
Language

(॥పల్లవి॥)
ఇన్నియుఁ దానే యెరుఁగు నేమనేనే
కన్నులఁ జూచితేనే కాఁక లనీని

(॥ఇన్ని॥)
యియ్యకొంటే నెందుకైన నిచ్చగించు మనసు
కయ్యమడిచితే నన్నీఁ గాదనును
ముయ్యిడ నామాటలు ముద్దుసేసు నిన్నాళ్లు
వెయ్యింటికి నేఁడైతే వెంగెము లనీని

(॥ఇన్ని॥)
వోరిచితే భోగాలకు నొడిగట్టుఁ దనువు
వూరకే వొల్లకవుంటే నోకిలించును
చేరి నాచేఁతలకెల్లా సిగ్గువడఁ డిన్నాళ్లు
ఆరసి నేఁడైతే నంటితే లోఁగీని

(॥ఇన్ని॥)
ఆస గలిగితే రతులన్నిటికిఁ దానే గురి
వేసరితే నలపులు వేళమే వచ్చు
సేసవెట్టి కాఁగిలించు శ్రీవేంకటేశుఁ డిన్నాళ్లు
వాసితో నేఁడై తేఁ గావరించి కూడీని

(||pallavi||)
inniyum̐ dāne yĕrum̐gu nemanene
kannulam̐ jūsidene kām̐ka lanīni

(||inni||)
yiyyagŏṁṭe nĕṁdugaina nichchagiṁchu manasu
kayyamaḍiside nannīm̐ gādanunu
muyyiḍa nāmāḍalu muddusesu ninnāḽlu
vĕyyiṁṭigi nem̐ḍaide vĕṁgĕmu lanīni

(||inni||)
voriside bhogālagu nŏḍigaṭṭum̐ danuvu
vūrage vŏllagavuṁṭe nogiliṁchunu
seri nāsem̐talagĕllā sigguvaḍam̐ ḍinnāḽlu
ārasi nem̐ḍaide naṁṭide lom̐gīni

(||inni||)
āsa galigide radulanniḍigim̐ dāne guri
vesaride nalabulu veḽame vachchu
sesavĕṭṭi kām̐giliṁchu śhrīveṁkaḍeśhum̐ ḍinnāḽlu
vāsido nem̐ḍai tem̐ gāvariṁchi kūḍīni