ఇన్నియు నుండఁగ దమ కేమి గడమ
(॥పల్లవి॥)
ఇన్నియు నుండఁగ దమ కేమి గడమ
వున్నవాఁడు సిరి పురుషోత్తమరాజు
(॥ఇన్నియు॥)
వీలుచు నీ రావటించీ వేదమరాజు
కూలికి గుండ్లు మోచీఁ గూర్మరాజు
పోలిమి నేలలు దవ్వీఁ బొలమురాజు
నాలి బడుచాట లాడీ నరసింగరాజు
(॥ఇన్నియు॥)
చేకొని చేతులు చాఁచీఁ జిక్కరాజు
రాకపోక దపసాయె రామరాజు
రాకట్నములే కట్టీ రాఘవరాజు
రేకలఁ బసులఁ గాచీ కృష్ణరాజు
(॥ఇన్నియు॥)
మగువల కిచ్చలాడీ మాకరాజు
జగమెల్లాఁ దిరిగీని జక్కరాజు
నగుఁబాటుదీర శ్రీవేంకటనగముపయి
వెగటై లోకము లేలే వెంగళరాజు
(||pallavi||)
inniyu nuṁḍam̐ga dama kemi gaḍama
vunnavām̐ḍu siri puruṣhottamarāju
(||inniyu||)
vīlusu nī rāvaḍiṁchī vedamarāju
kūligi guṁḍlu mosīm̐ gūrmarāju
polimi nelalu davvīm̐ bŏlamurāju
nāli baḍusāḍa lāḍī narasiṁgarāju
(||inniyu||)
segŏni sedulu sām̐sīm̐ jikkarāju
rāgaboga dabasāyĕ rāmarāju
rāgaṭnamule kaṭṭī rāghavarāju
regalam̐ basulam̐ gāsī kṛṣhṇarāju
(||inniyu||)
maguvala kichchalāḍī māgarāju
jagamĕllām̐ dirigīni jakkarāju
nagum̐bāḍudīra śhrīveṁkaḍanagamubayi
vĕgaḍai logamu lele vĕṁgaḽarāju