Inniyu nokkadokkade yerarammaa

ఇన్నియు నొక్కటొక్కటే యేరరమ్మా
Language

(॥పల్లవి॥)
ఇన్నియు నొక్కటొక్కటే యేరరమ్మా
యెన్నికతోఁ గప్పముగా నిత్తము గాని

(॥ఇన్ని॥)
తొయ్యలి రెప్పలతుద దోసెఁడేసి ముత్యాలు
పయ్యదపై రాలీని పట్టరమ్మా
యియ్యెడఁ జెలియఁ బాసి యింతఁగాఁ జేసినయీ
నెయ్యపు విభునిమీఁద నింతము గాని

(॥ఇన్ని॥)
కలికి తురుమునను గంపెఁడేసి నీలాలు
నిలువునఁ జెదరీని నిలుపరమ్మా
తలపెల్ల దక్కఁగొని తరుణి నింత చేసిన
యెలయింపు బతికి మీఁదెత్తుదము గాని

(॥ఇన్ని॥)
ముదితపలుకులను మూటెఁడేసి వజ్రాలు
యెదురెదురనే చిందీ నెత్తరమ్మా
వెదచల్లుఁ గరిమి శ్రీవేంకటేశుఁ డింతిఁ గూడె
పొదిగి తలఁబాలుగఁ బోతము గాని

(||pallavi||)
inniyu nŏkkaḍŏkkaḍe yerarammā
yĕnnigadom̐ gappamugā nittamu gāni

(||inni||)
tŏyyali rĕppaladuda dosĕm̐ḍesi mutyālu
payyadabai rālīni paṭṭarammā
yiyyĕḍam̐ jĕliyam̐ bāsi yiṁtam̐gām̐ jesinayī
nĕyyabu vibhunimīm̐da niṁtamu gāni

(||inni||)
kaligi turumunanu gaṁpĕm̐ḍesi nīlālu
niluvunam̐ jĕdarīni nilubarammā
talabĕlla dakkam̐gŏni taruṇi niṁta sesina
yĕlayiṁpu badigi mīm̐dĕttudamu gāni

(||inni||)
mudidabalugulanu mūḍĕm̐ḍesi vajrālu
yĕdurĕdurane siṁdī nĕttarammā
vĕdasallum̐ garimi śhrīveṁkaḍeśhum̐ ḍiṁtim̐ gūḍĕ
pŏdigi talam̐bālugam̐ bodamu gāni