ఇన్నియు నిందే వున్నవి యెఱుఁగుకో నీకు నీవే
(॥పల్లవి॥)
ఇన్నియు నిందే వున్నవి యెఱుఁగుకో నీకు నీవే
నిన్ను నేమీ నననేల నీచి త్త మిఁకను
(॥ఇన్ని॥)
పలుకఁబోతే నీతో పంతములై తోఁచీని
కలఁగి వూరకుంటేను గర్వ మయ్యీని
సొలపులు నెరపితే సూడువట్టినట్టయ్యీని
నెలకొని వుండే నేను నీచిత్త మిఁకను
(॥ఇన్ని॥)
నగఁబోతే నీతోను నాఁటకమై తోఁచీని
పగటు చూపఁగబోతే బలిమయ్యీని
మొగమిచ్చ లాఁడబోతే మొఱఁగులై నిలిచీని
నిగిడి నే నుండఁగాను నీచిత్త మిఁకను
(॥ఇన్ని॥)
తప్పక కొంగువట్టితే దంటతనమై తోఁచీని
రెప్పలెత్తి చూడఁబోతే రేసువుట్టీని
అప్పఁడ శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
నెప్పనఁ గూడితి మిది నీచిత్తమిఁకను
(||pallavi||)
inniyu niṁde vunnavi yĕṟum̐gugo nīgu nīve
ninnu nemī nananela nīsi tta mim̐kanu
(||inni||)
palugam̐bode nīdo paṁtamulai tom̐sīni
kalam̐gi vūraguṁṭenu garva mayyīni
sŏlabulu nĕrabide sūḍuvaṭṭinaṭṭayyīni
nĕlagŏni vuṁḍe nenu nīsitta mim̐kanu
(||inni||)
nagam̐bode nīdonu nām̐ṭagamai tom̐sīni
pagaḍu sūbam̐gabode balimayyīni
mŏgamichcha lām̐ḍabode mŏṟam̐gulai nilisīni
nigiḍi ne nuṁḍam̐gānu nīsitta mim̐kanu
(||inni||)
tappaga kŏṁguvaṭṭide daṁṭadanamai tom̐sīni
rĕppalĕtti sūḍam̐bode resuvuṭṭīni
appam̐ḍa śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
nĕppanam̐ gūḍidi midi nīsittamim̐kanu