ఇన్నియు నీయందే కంటి మిఁక నొకచోటఁ గాదు
(॥పల్లవి॥)
ఇన్నియు నీయందే కంటి మిఁక నొకచోటఁ గాదు
సన్నల చాయల నేము సంతోసించేమయ్యా
(॥॥)
మగవానికేడ సిగ్గు మగువలు వద్దనుంటే
తగిలి కాఁగలించఁగఁ దమకింతురు
యెగసక్కేలాడేవారి నెరఁగరు చెలరేఁగి
పగటు వయోమదము పచరింతురు
(॥॥)
కోడెకానికేడ వేళ కొమ్మలు మాటలాడితే
యేడనైనాఁ గూడుమంటా నెచ్చరింతురు
ఆడికెకు వెరవరు అండవారిఁ జూడరు
వీడెపు మోవితేనెకు వేఁడుకొందురు
(॥॥)
మొక్కలీనికేడ నీతి ముదితలఁ బొడగంటే
గక్కునఁ గాఁగిట నించి కరగింతురు
మక్కువ శ్రీవేంకటేశ మండెమురాయఁడవై
యిక్కడ నన్నేలితివి యింతా నెరుఁగుదురు
(||pallavi||)
inniyu nīyaṁde kaṁṭi mim̐ka nŏgasoḍam̐ gādu
sannala sāyala nemu saṁtosiṁchemayyā
(||||)
magavānigeḍa siggu maguvalu vaddanuṁṭe
tagili kām̐galiṁcham̐gam̐ damagiṁturu
yĕgasakkelāḍevāri nĕram̐garu sĕlarem̐gi
pagaḍu vayomadamu pasariṁturu
(||||)
koḍĕgānigeḍa veḽa kŏmmalu māḍalāḍide
yeḍanainām̐ gūḍumaṁṭā nĕchchariṁturu
āḍigĕgu vĕravaru aṁḍavārim̐ jūḍaru
vīḍĕbu movidenĕgu vem̐ḍugŏṁduru
(||||)
mŏkkalīnigeḍa nīdi mudidalam̐ bŏḍagaṁṭe
gakkunam̐ gām̐giḍa niṁchi karagiṁturu
makkuva śhrīveṁkaḍeśha maṁḍĕmurāyam̐ḍavai
yikkaḍa nannelidivi yiṁtā nĕrum̐guduru