Inniyu neeve nerudu vimka nennadu

ఇన్నియు నీవే నేరుతు విఁక నెన్నడు
Language

(॥పల్లవి॥)
ఇన్నియు నీవే నేరుతు విఁక నెన్నడు
పన్నిన సటలెల్లాఁ జేసి పాలార్చవయ్యా

(॥ఇన్ని॥)
కాంతకు నీబుజమురేకలు చూచినంతనుండి
చింతతోడ చెక్కులెల్లాఁ జెమరించెను
మంతనానకుఁ బిలిచి మనసుమర్మము సోఁక
పొంతనే నీవానవెట్టి బొంకఁగదవయ్యా

(॥ఇన్ని॥)
కొమ్మ నీతురుము చూచి కొత్తపూవులెల్లాఁ జూచి
తమి మోము వంచుకొని తడఁబడీని
నెమ్మనమలర నీవు నేరుపులెల్లా మెరసి
సమ్మతించేయట్టుగాను సత్యాతు చూపవయ్యా

(॥ఇన్ని॥)
అలమేలు మంగ నీవాడేటిప్రియాలు చూచి
కలసి మోవిచ్చె శ్రీవేంకటేశ్వరుఁడా
వెలయ నింకా నీవు వేవేలుచందముల
పలుసాకిరులు చెప్పి భ్రమయించవయ్యా

(||pallavi||)
inniyu nīve nerudu vim̐ka nĕnnaḍu
pannina saḍalĕllām̐ jesi pālārsavayyā

(||inni||)
kāṁtagu nībujamuregalu sūsinaṁtanuṁḍi
siṁtadoḍa sĕkkulĕllām̐ jĕmariṁchĕnu
maṁtanānagum̐ bilisi manasumarmamu som̐ka
pŏṁtane nīvānavĕṭṭi bŏṁkam̐gadavayyā

(||inni||)
kŏmma nīdurumu sūsi kŏttabūvulĕllām̐ jūsi
tami momu vaṁchugŏni taḍam̐baḍīni
nĕmmanamalara nīvu nerubulĕllā mĕrasi
sammadiṁcheyaṭṭugānu satyādu sūbavayyā

(||inni||)
alamelu maṁga nīvāḍeḍipriyālu sūsi
kalasi movichchĕ śhrīveṁkaḍeśhvarum̐ḍā
vĕlaya niṁkā nīvu vevelusaṁdamula
palusāgirulu sĕppi bhramayiṁchavayyā