Inniyu neegu neribe needamde kade

ఇన్నియు నీకు నేరిపె నీతఁడే కదే
Language

(॥పల్లవి॥)
ఇన్నియు నీకు నేరిపె నీతఁడే కదే
కన్నెతనము వెలనెఁ గాఁగిలించఁగాను

(॥॥)
శిరసేల వంచేవే సిగ్గులేల పెంచేవే
సిరులనవ్వుతోఁ బతి సేసవెట్టఁగా
తెర యేల వేసేవే గురులేల వాసేవే
పొరిఁ బువ్వులు ముడిచి పూజించఁ గాను

(॥॥)
వొట్టులేల పెట్టేవే వూరకేల తిట్టేవే
జట్టిగొని యీతఁడు చన్నుంటఁగా
గుట్టులేల పెట్టేవే కొసరేల కలపేవే
చుట్టరికాన నిన్నుఁ జొక్కించఁ గాను

(॥॥)
పాదమేల తొక్కేవే పైపైనేల మొక్కేవే
యీదెస శ్రీ వేంకటేశుఁ డేలుకోఁ గాను
పోదులేల నెరుపేవే పొందులెన్ని గరుపేవే
ఆదిగొని నన్నేలి నీకప్పగించఁ గాను

(||pallavi||)
inniyu nīgu neribĕ nīdam̐ḍe kade
kannĕdanamu vĕlanĕm̐ gām̐giliṁcham̐gānu

(||||)
śhirasela vaṁcheve siggulela pĕṁcheve
sirulanavvudom̐ badi sesavĕṭṭam̐gā
tĕra yela veseve gurulela vāseve
pŏrim̐ buvvulu muḍisi pūjiṁcham̐ gānu

(||||)
vŏṭṭulela pĕṭṭeve vūragela tiṭṭeve
jaṭṭigŏni yīdam̐ḍu sannuṁṭam̐gā
guṭṭulela pĕṭṭeve kŏsarela kalabeve
suṭṭarigāna ninnum̐ jŏkkiṁcham̐ gānu

(||||)
pādamela tŏkkeve paibainela mŏkkeve
yīdĕsa śhrī veṁkaḍeśhum̐ ḍelugom̐ gānu
podulela nĕrubeve pŏṁdulĕnni garubeve
ādigŏni nanneli nīgappagiṁcham̐ gānu