ఇన్నియు నీ కలవాటే ఇంత సేయజెల్లదా
(॥పల్లవి॥)
ఇన్నియు నీ కలవాటే ఇంత సేయజెల్లదా
సన్నమేమి దొడ్డేమి సడిసన్నవారికి
(॥ఇన్ని॥)
చెల్లదా నీకు నాచెఱఁగువట్టి తియ్యగ
గొల్లెతలచీర అందుకొన్ననీకును
చెల్లఁబో నీవు నాతో చేరి నవ్వఁ జెల్లదా
తల్లిఁగూఁతు నొక్కవావిఁ దగులనవ్వేనీకు
(॥ఇన్ని॥)
వెక్కసాన నీవు నన్ను వేసుకొన్నాఁ జెల్లదా
గక్కునఁ బదారువేలఁ గైకొన్ననీకు
తెక్కులఁ దిట్టి నా చేతఁ దిట్టించుకోఁజెల్లదా
వొక్కట నూరుదిట్ల కోరిచిననీకు
(॥ఇన్ని॥)
తెగి నన్ను నీమీఁదికిఁ దీకొన్నాఁ జెల్లదా
మోగి శ్రీసతి నురాన మోచిననీకు
తగురా శ్రీవేంకటేశ దక్క నన్నుఁ గూడితివి
నగ నిఁకఁ జెల్లదా నాటకపునీకు
(||pallavi||)
inniyu nī kalavāḍe iṁta seyajĕlladā
sannamemi dŏḍḍemi saḍisannavārigi
(||inni||)
sĕlladā nīgu nāsĕṟam̐guvaṭṭi tiyyaga
gŏllĕdalasīra aṁdugŏnnanīgunu
sĕllam̐bo nīvu nādo seri navvam̐ jĕlladā
tallim̐gūm̐tu nŏkkavāvim̐ dagulanavvenīgu
(||inni||)
vĕkkasāna nīvu nannu vesugŏnnām̐ jĕlladā
gakkunam̐ badāruvelam̐ gaigŏnnanīgu
tĕkkulam̐ diṭṭi nā sedam̐ diṭṭiṁchugom̐jĕlladā
vŏkkaḍa nūrudiṭla korisinanīgu
(||inni||)
tĕgi nannu nīmīm̐digim̐ dīgŏnnām̐ jĕlladā
mogi śhrīsadi nurāna mosinanīgu
tagurā śhrīveṁkaḍeśha dakka nannum̐ gūḍidivi
naga nim̐kam̐ jĕlladā nāḍagabunīgu