Inniyu gannatti meemda nimka nelaa

ఇన్నియు గన్నట్టి మీఁద నిఁక నేలా
Language

(॥పల్లవి॥)
ఇన్నియు గన్నట్టి మీఁద నిఁక నేలా
యెన్నికలు నీకు నాకు నిఁక నేలా

(॥ఇన్నియు॥)
పొదిగి నీ వనఁ గాను పూఁచి నిన్ను నే నాడఁగా
యెదురుబడి మాటలు యిఁక నేలా
కదిసి యీవలఁ జూచి కన్నవారె నవ్వఁ గాను
యిదివో మనలో వాదు లిఁక నేలా

(॥ఇన్నియు॥)
సారె సారె నీవు నేను సరసము లాడఁ గాను
యీరు దియ్యఁ బేను వచ్చు నిఁక నేలా
మోరతోపుఁదనములు మొగములో నుండఁ గాను
యీరీతి సాకి రడుగ నిఁక నేలా

(॥ఇన్నియు॥)
పంతముల నిందాఁకఁ బరాకులె పచరించి
యింతలోనె యిచ్చము లిఁక నేలా
అంతటి శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
యింతటఁ గూడితి రేసు లిఁక నేలా

(||pallavi||)
inniyu gannaṭṭi mīm̐da nim̐ka nelā
yĕnnigalu nīgu nāgu nim̐ka nelā

(||inniyu||)
pŏdigi nī vanam̐ gānu pūm̐si ninnu ne nāḍam̐gā
yĕdurubaḍi māḍalu yim̐ka nelā
kadisi yīvalam̐ jūsi kannavārĕ navvam̐ gānu
yidivo manalo vādu lim̐ka nelā

(||inniyu||)
sārĕ sārĕ nīvu nenu sarasamu lāḍam̐ gānu
yīru diyyam̐ benu vachchu nim̐ka nelā
moradobum̐danamulu mŏgamulo nuṁḍam̐ gānu
yīrīdi sāgi raḍuga nim̐ka nelā

(||inniyu||)
paṁtamula niṁdām̐kam̐ barāgulĕ pasariṁchi
yiṁtalonĕ yichchamu lim̐ka nelā
aṁtaḍi śhrīvĕṁkaḍeśha alamelumaṁga nenu
yiṁtaḍam̐ gūḍidi resu lim̐ka nelā