Innim dama kalbidamu lidarasammadu launaa

ఇన్నిఁ దమ కల్పితము లితరసమ్మతు లౌనా
Language

(॥పల్లవి॥)
ఇన్నిఁ దమ కల్పితము లితరసమ్మతు లౌనా
వున్నది వున్నటువలె నొనరింపపలదా

(॥ఇన్ని॥)
చెప్పు గాక ప్రకృతిని చేరి నాల్గువేదముఁల
గప్పి యనిర్వాచ్య మని కద్దా కొంత
అప్పటి వుపనిషత్తు లన్ని ముఖ్యము గాక
తప్పి కొన్ని యతత్వావేదకము లున్నదా

(॥ఇన్ని॥)
దేవతాయజ్ఞములు బోధించుఁ గాక శాస్త్రములు
వ్యావహారికనిత్యత్వ మందు నున్నదా
భావింప జగత్తు లెల్లా బ్రహ్మమయ మండ్రు గాక
ఆవలఁ బురాణాల మిథ్యావాచక మున్నదా

(॥ఇన్ని॥)
మోక్షఫలాశక్తులని మునులు వున్నారు గాక
వీక్షింప విఫలు లని వింటిమా ధాత్రి
రక్షించి శ్రీవేంకటేశ రమణతో జీవులను
కుక్షిఁ బెట్టుకొన్నాఁ డది గుణము సత్యమా

(||pallavi||)
innim̐ dama kalbidamu lidarasammadu launā
vunnadi vunnaḍuvalĕ nŏnariṁpabaladā

(||inni||)
sĕppu gāga prakṛtini seri nālguvedamum̐la
gappi yanirvāchya mani kaddā kŏṁta
appaḍi vubaniṣhattu lanni mukhyamu gāga
tappi kŏnni yadatvāvedagamu lunnadā

(||inni||)
devadāyajñamulu bodhiṁchum̐ gāga śhāstramulu
vyāvahāriganityatva maṁdu nunnadā
bhāviṁpa jagattu lĕllā brahmamaya maṁḍru gāga
āvalam̐ burāṇāla mithyāvāsaga munnadā

(||inni||)
mokṣhaphalāśhaktulani munulu vunnāru gāga
vīkṣhiṁpa viphalu lani viṁṭimā dhātri
rakṣhiṁchi śhrīveṁkaḍeśha ramaṇado jīvulanu
kukṣhim̐ bĕṭṭugŏnnām̐ ḍadi guṇamu satyamā