Innidigim breragumdu yeeshvarumdimte

ఇన్నిటికిఁ బ్రేరకుఁడు యీశ్వరుఁడింతే
Language

(॥పల్లవి॥)
ఇన్నిటికిఁ బ్రేరకుఁడు యీశ్వరుఁడింతే
పన్ని యీతనిఁ దెలిసి బ్రదుకుటే జ్ఞానము

(॥ఇన్ని॥)
మనసునఁ బుట్టిన మంకుఁ గామక్రోధాలు
పనిలేవు తనకంటేఁ బాప మంటదు
పనివి తొడమ నూడి పండు తీఁగె నంటదు
జనులకెల్లాఁ బ్రకృతిసహజ మింతే

(॥ఇన్ని॥)
చేతులారఁ జేసేటి చేకొన్న కర్మానకు
ఘాతలఁ గర్తఁ గానంటే కట్టువడఁడు
ఆతల నబక ముంచినట్టి వేఁడి చెయ్యంటదు
జాతి దేహము మోఁచిన సహజ మింతే

(॥ఇన్ని॥)
వాకున నాడినయట్టి వట్టి పల్లదాలనెల్లా
దాకొని పొరయనంటే తప్పులే లేవు
పైకొని శ్రీవేంకటేశుబంటుకు వళకు లేదు
సైకమైన హరిభక్తి సహజ మింతే

(||pallavi||)
inniḍigim̐ breragum̐ḍu yīśhvarum̐ḍiṁte
panni yīdanim̐ dĕlisi braduguḍe jñānamu

(||inni||)
manasunam̐ buṭṭina maṁkum̐ gāmakrodhālu
panilevu tanagaṁṭem̐ bāba maṁṭadu
panivi tŏḍama nūḍi paṁḍu tīm̐gĕ naṁṭadu
janulagĕllām̐ brakṛtisahaja miṁte

(||inni||)
sedulāram̐ jeseḍi segŏnna karmānagu
ghādalam̐ gardam̐ gānaṁṭe kaṭṭuvaḍam̐ḍu
ādala nabaga muṁchinaṭṭi vem̐ḍi sĕyyaṁṭadu
jādi dehamu mom̐sina sahaja miṁte

(||inni||)
vāguna nāḍinayaṭṭi vaṭṭi palladālanĕllā
dāgŏni pŏrayanaṁṭe tappule levu
paigŏni śhrīveṁkaḍeśhubaṁṭugu vaḽagu ledu
saigamaina haribhakti sahaja miṁte