ఇన్నిటికి సెలవుగా నిదివో మొక్కే నేను
(॥పల్లవి॥)
ఇన్నిటికి సెలవుగా నిదివో మొక్కే నేను
మన్నించుమింతట నన్ను మంకు నేనెరఁగను
(॥॥)
చనవు గలదు గాన సరివెనఁగితి నీతో
యెనసి చన్నులొత్తుట యెరఁగనైతి
నను మన్నింతువు గాన నవ్వులెల్ల నవ్వితిని
మనసుకు వెంగెమౌత మరి నేనెఱఁగను
(॥॥)
మచ్చిక గలదు గాన మాటలెల్లా నాడితిని
యెచ్చుకుందులగుట నే నెఱఁగనైతి
యిచ్చగింతువు గనక యిట్టే పాదము దొక్కితి
నిచ్చలాన మితిమీఱుటని యెంచనైతిని
(॥॥)
సేస వెట్టితివి గాన చేతులు చాఁచితి నీపై
యీసిగ్గులు రేఁగుట నే నెఱఁగనైతి
రాసికెక్కించితి గాన రతులఁజొక్కించితిని
ఆసల శ్రీవేంకటేశ అలయిక చూడను
(||pallavi||)
inniḍigi sĕlavugā nidivo mŏkke nenu
manniṁchumiṁtaḍa nannu maṁku nenĕram̐ganu
(||||)
sanavu galadu gāna sarivĕnam̐gidi nīdo
yĕnasi sannulŏttuḍa yĕram̐ganaidi
nanu manniṁtuvu gāna navvulĕlla navvidini
manasugu vĕṁgĕmauda mari nenĕṟam̐ganu
(||||)
machchiga galadu gāna māḍalĕllā nāḍidini
yĕchchuguṁdulaguḍa ne nĕṟam̐ganaidi
yichchagiṁtuvu ganaga yiṭṭe pādamu dŏkkidi
nichchalāna midimīṟuḍani yĕṁchanaidini
(||||)
sesa vĕṭṭidivi gāna sedulu sām̐sidi nībai
yīsiggulu rem̐guḍa ne nĕṟam̐ganaidi
rāsigĕkkiṁchidi gāna radulam̐jŏkkiṁchidini
āsala śhrīveṁkaḍeśha alayiga sūḍanu