Innidigi nobudu viduvamti neegunu

ఇన్నిటికి నోపుదు విటువంటి నీకును
Language

(॥పల్లవి॥)
ఇన్నిటికి నోపుదు విటువంటి నీకును
యెన్నఁగ వలచివచ్చే దేమిబాఁతి సతులు

(॥ఇన్ని॥)
చుట్టపువరసకుఁగాఁ జొచ్చి బండి రొప్పితివి
గుట్టున గొల్లలకుఁగా కొండ యెత్తితి
బిట్టువాగెలఁ బెండ్లిపేరటము వోతివి
యిట్టిపూసగొండివి నీకేమిబాఁతి సతులు

(॥ఇన్ని॥)
మామపంచ వేఁడుకొని మనికియై వున్నాఁడవు
చూ; మరల నింటఁ బసులఁ గాచితి
దోమటి దోడివితివి దొడ్డివారి యిండ్లను
యీమంచి యిచ్చకుని కేమిబాఁతి సతులు

(॥ఇన్ని॥)
అంకెల యజ్ఞసత్నుల నడిగి బోంసేసితివి
కంకిగాఁ గోకలు మోచి కాచుకుండితి
వుంకువ నలమేల్మంగ నురమెక్కించుకొంటివి
యింక శ్రీవేంకటేశ నీకేమిబాఁతి సతులు

(||pallavi||)
inniḍigi nobudu viḍuvaṁṭi nīgunu
yĕnnam̐ga valasivachche demibām̐ti sadulu

(||inni||)
suṭṭabuvarasagum̐gām̐ jŏchchi baṁḍi rŏppidivi
guṭṭuna gŏllalagum̐gā kŏṁḍa yĕttidi
biṭṭuvāgĕlam̐ bĕṁḍliberaḍamu vodivi
yiṭṭibūsagŏṁḍivi nīgemibām̐ti sadulu

(||inni||)
māmabaṁcha vem̐ḍugŏni manigiyai vunnām̐ḍavu
sū; marala niṁṭam̐ basulam̐ gāsidi
domaḍi doḍividivi dŏḍḍivāri yiṁḍlanu
yīmaṁchi yichchaguni kemibām̐ti sadulu

(||inni||)
aṁkĕla yajñasatnula naḍigi boṁsesidivi
kaṁkigām̐ gogalu mosi kāsuguṁḍidi
vuṁkuva nalamelmaṁga nuramĕkkiṁchugŏṁṭivi
yiṁka śhrīveṁkaḍeśha nīgemibām̐ti sadulu