Innidigi ninnadige dide yayyaa

ఇన్నిటికి నిన్నడిగే దిదే యయ్యా
Language

(॥పల్లవి॥)
ఇన్నిటికి నిన్నడిగే దిదే యయ్యా
యెన్నికలు మాకు దాఁచ నీఁక నేఁటికయ్యా

(॥ఇన్ని॥)
వనితల నంపఁగాను వత్తువో రావో యంటా
నినుఁ బిలువఁగ నేఁడు నేనే వచ్చితి
కనుసన్నలనే కాని కడుఁ దమకించరాదు
మనసులోపలిమాట మాకుఁ జెప్పవయ్యా

(॥ఇన్ని॥)
ఆకులు వాశంపఁగాను అనుమానింతువో యంటా
చేకొని నేనే విన్నవించితి నింతాను
వాకు ప్రియమే కాని వడిఁ గోపించఁగ రాదు
యేకొలఁది నీమోహ మెరిఁగించవయ్యా

(॥ఇన్ని॥)
కానుక లిచ్చి యంపగా కందువో కానవో యంటా
ఆనుక నే నిలుచుంటి నాయాలు సోక
నేను సేసినభాగ్యాన నీవె నన్నుఁ గూడితివి
కానిలే శ్రీవేంకటేశ కరుణించవయ్యా

(||pallavi||)
inniḍigi ninnaḍige dide yayyā
yĕnnigalu māgu dām̐sa nīm̐ka nem̐ṭigayyā

(||inni||)
vanidala naṁpam̐gānu vattuvo rāvo yaṁṭā
ninum̐ biluvam̐ga nem̐ḍu nene vachchidi
kanusannalane kāni kaḍum̐ damagiṁcharādu
manasulobalimāḍa māgum̐ jĕppavayyā

(||inni||)
āgulu vāśhaṁpam̐gānu anumāniṁtuvo yaṁṭā
segŏni nene vinnaviṁchidi niṁtānu
vāgu priyame kāni vaḍim̐ gobiṁcham̐ga rādu
yegŏlam̐di nīmoha mĕrim̐giṁchavayyā

(||inni||)
kānuga lichchi yaṁpagā kaṁduvo kānavo yaṁṭā
ānuga ne nilusuṁṭi nāyālu soga
nenu sesinabhāgyāna nīvĕ nannum̐ gūḍidivi
kānile śhrīveṁkaḍeśha karuṇiṁchavayyā