ఇన్నిటికి నీకు మొక్కే మెఱిఁగి మన్నించవయ్య
(॥పల్లవి॥)
ఇన్నిటికి నీకు మొక్కే మెఱిఁగి మన్నించవయ్య
వన్నెల మా సేఁత లెట్టువలసినా వచ్చు
(॥ఇన్ని॥)
సరసపుమాటలు సారె నీతో నాడుదుము
యరవుల నీకవి యెగ్గులో తప్పో
పురిగొనే యాసలను బొమ్మల జంకింతుము
వరుసల నీచిత్తము వచ్చునో రాదో
(॥ఇన్ని॥)
కొదలుచు నేము నీకొంగువట్టి తీతుము
యిది దెలియదు నీకు నితవో కాదో
పదిమారులు నిన్ను భావించి నవ్వుదుము
వుదుటున సమ్మతింతువో సమ్మతించవో
(॥ఇన్ని॥)
ఘనమున నిన్ను నట్టె కాఁగిలించి కూడుదుము
వెనక నెఱఁగ మది వేడుకో వెట్టో
తనిసి శ్రీవేంకటేశ దాయక పాయకుందుము
యెనసితి వింకా నీకు యింపో సొంపో
(||pallavi||)
inniḍigi nīgu mŏkke mĕṟim̐gi manniṁchavayya
vannĕla mā sem̐ta lĕṭṭuvalasinā vachchu
(||inni||)
sarasabumāḍalu sārĕ nīdo nāḍudumu
yaravula nīgavi yĕggulo tappo
purigŏne yāsalanu bŏmmala jaṁkiṁtumu
varusala nīsittamu vachchuno rādo
(||inni||)
kŏdalusu nemu nīgŏṁguvaṭṭi tīdumu
yidi dĕliyadu nīgu nidavo kādo
padimārulu ninnu bhāviṁchi navvudumu
vuduḍuna sammadiṁtuvo sammadiṁchavo
(||inni||)
ghanamuna ninnu naṭṭĕ kām̐giliṁchi kūḍudumu
vĕnaga nĕṟam̐ga madi veḍugo vĕṭṭo
tanisi śhrīveṁkaḍeśha dāyaga pāyaguṁdumu
yĕnasidi viṁkā nīgu yiṁpo sŏṁpo