Innidigi moolamu yimdiraanaayaga neeve

ఇన్నిటికి మూలము యిందిరానాయక నీవే
Language

(॥పల్లవి॥)
ఇన్నిటికి మూలము యిందిరానాయక నీవే
సన్నల నే నెటువలె సాదింతునయ్యా

(॥ఇన్ని॥)
యెందును బలవంతము యింతుల చుట్టరికము
అందునకంటే వాలాయ మాహారవాంఛ
అందిన పిసిఁడితన మారెంటికంటె నిష్టతి
కందున నే నెవ్వరినిఁ గాద నీ తొత్తునయ్యా

(॥ఇన్ని॥)
వీడని సమ్మంధము వెస దేహానకు నాకు
ఆడి కూడిన సంగాత మహంకారము
తోడిలంకె యెపుడును దురభిమానములు
వాడికేయ నెవ్వరి నీవల కందు నయ్యా

(॥ఇన్ని॥)
మిక్కిలి నేస్తముతొల్లె మించులబంగారము
నిక్కముగా ననుబంధి నిర్దయత్వము
వొక్కటై కనుఁగొనుచు వున్నాఁడవు నాలో నీవే
యిక్కడ శ్రీవేంకటేశ యెవ్వరి రోతు వయ్యా

(||pallavi||)
inniḍigi mūlamu yiṁdirānāyaga nīve
sannala ne nĕḍuvalĕ sādiṁtunayyā

(||inni||)
yĕṁdunu balavaṁtamu yiṁtula suṭṭarigamu
aṁdunagaṁṭe vālāya māhāravāṁchha
aṁdina pisim̐ḍidana mārĕṁṭigaṁṭĕ niṣhṭadi
kaṁduna ne nĕvvarinim̐ gāda nī tŏttunayyā

(||inni||)
vīḍani sammaṁdhamu vĕsa dehānagu nāgu
āḍi kūḍina saṁgāda mahaṁkāramu
toḍilaṁkĕ yĕbuḍunu durabhimānamulu
vāḍigeya nĕvvari nīvala kaṁdu nayyā

(||inni||)
mikkili nestamudŏllĕ miṁchulabaṁgāramu
nikkamugā nanubaṁdhi nirdayatvamu
vŏkkaḍai kanum̐gŏnusu vunnām̐ḍavu nālo nīve
yikkaḍa śhrīveṁkaḍeśha yĕvvari rodu vayyā