Innidigi moolamu yeedaniroobu

ఇన్నిటికి మూలము యీతనిరూపు
Language

(॥పల్లవి॥)
ఇన్నిటికి మూలము యీతనిరూపు
యెన్నఁగ నుపమలకు నిరవైనట్లుండె

(॥ఇన్నిటికి॥)
కమలనాభునికి కప్పురపుకాపు మేన
సముచితముగఁ బైపై చాఁతినపుడు
అమృతముదచ్చేవేళ నట్టే మేనఁ దుంపుర్లు
తమితోడ నిండుకొని దట్టమైనట్లుండె

(॥ఇన్నిటికి॥)
దైవశిఖామణికి తట్టుపుణుఁగు మేనను
చేవమీర నించి సేవసేసేయప్పుడు
వేవేలుగా యమునలో వేమారు నీఁదులాడఁగా
కావిరి కాళిమ నిండాఁగప్పినయట్టుండె

(॥ఇన్నిటికి॥)
అలుమేలుమంగతోడ నట్టే శ్రీవేంకటపతి-
కెలమితో సొమ్మువెట్టి యెంచినుపుడు
కులికి గొల్లెతలను కూడఁగా గుబ్బలమీఁదఁ
గలపసపెల్లా వచ్చి కమ్ముకొన్నట్లుండె

(||pallavi||)
inniḍigi mūlamu yīdanirūbu
yĕnnam̐ga nubamalagu niravainaṭluṁḍĕ

(||inniḍigi||)
kamalanābhunigi kappurabugābu mena
samusidamugam̐ baibai sām̐tinabuḍu
amṛtamudachcheveḽa naṭṭe menam̐ duṁpurlu
tamidoḍa niṁḍugŏni daṭṭamainaṭluṁḍĕ

(||inniḍigi||)
daivaśhikhāmaṇigi taṭṭubuṇum̐gu menanu
sevamīra niṁchi sevaseseyappuḍu
vevelugā yamunalo vemāru nīm̐dulāḍam̐gā
kāviri kāḽima niṁḍām̐gappinayaṭṭuṁḍĕ

(||inniḍigi||)
alumelumaṁgadoḍa naṭṭe śhrīveṁkaḍabadi-
kĕlamido sŏmmuvĕṭṭi yĕṁchinubuḍu
kuligi gŏllĕdalanu kūḍam̐gā gubbalamīm̐dam̐
galabasabĕllā vachchi kammugŏnnaṭluṁḍĕ