Innidigi moolamu yeedani roobu

ఇన్నిటికి మూలము యీతని రూపు
Language

(॥పల్లవి॥)
ఇన్నిటికి మూలము యీతని రూపు
యెన్నఁగ నుపమలకు నిరవైనట్లుండె

(॥ఇన్ని॥)
కమలనాభునికి కప్పురకాపు మేన
సముచితముగఁ బై పై చాఁతినపుడు
అమృతము దచ్చేవేళ నట్టే మేనఁ దుంపుర్లు
తమితోడ నిండుకొని దట్టిమైన ట్లుండె

(॥ఇన్ని॥)
దైవశిఖామణికి తట్టుపుణుఁగు మేనను
చేవమీఱ నించి సేవ సేసేయప్పుడు
వేవేలుగా యమునలో వేమారు నీఁదులాడఁగా
కావిరి కాళిమ నిండాఁ గప్పినయ ట్లుండే

(॥ఇన్ని॥)
అలమేలుమంగతోడ నట్టే శ్రీవేంకటపతి
కెలమితో సొమ్ము వెట్టి యెంచినపుడు
కులికి గొల్లెతలను కూడఁగా గుబ్బలమీఁదఁ
గల పసలెల్లా వచ్చి కమ్ముకొన్న ట్లుండే

(||pallavi||)
inniḍigi mūlamu yīdani rūbu
yĕnnam̐ga nubamalagu niravainaṭluṁḍĕ

(||inni||)
kamalanābhunigi kappuragābu mena
samusidamugam̐ bai pai sām̐tinabuḍu
amṛtamu dachcheveḽa naṭṭe menam̐ duṁpurlu
tamidoḍa niṁḍugŏni daṭṭimaina ṭluṁḍĕ

(||inni||)
daivaśhikhāmaṇigi taṭṭubuṇum̐gu menanu
sevamīṟa niṁchi seva seseyappuḍu
vevelugā yamunalo vemāru nīm̐dulāḍam̐gā
kāviri kāḽima niṁḍām̐ gappinaya ṭluṁḍe

(||inni||)
alamelumaṁgadoḍa naṭṭe śhrīveṁkaḍabadi
kĕlamido sŏmmu vĕṭṭi yĕṁchinabuḍu
kuligi gŏllĕdalanu kūḍam̐gā gubbalamīm̐dam̐
gala pasalĕllā vachchi kammugŏnna ṭluṁḍe