Innidigi moolamu idamdu naa ramanumdu

ఇన్నిటికి మూలము ఇతఁడు నా రమణుఁడు
Language

(॥పల్లవి॥)
ఇన్నిటికి మూలము ఇతఁడు నా రమణుఁడు
కన్నులారఁ జెలులాల కనుఁగొంటిరటరే

(॥ఇన్ని॥)
తనివోనియాసలు తమకానకు మూలము
ననుపులు చుట్టరికానకు మూలము
చెనకినచెనకులు సిగ్గులకు మూలము
వినయాలు సురతపువేడుకకు మూలము

(॥ఇన్ని॥)
కొసరుఁజూపులెల్లాను కోరికలకు మూలము
కసరుజం కెలు మచ్చికకు మూలము
ముసిముసినవ్వులు ముచ్చటలకు మూలము
పొసఁగినసరసాలు పొందులకు మూలము

(॥ఇన్ని॥)
తలపోఁతలు మదనతంత్రములకు మూలము
లలిఁ దాలిములు పొందులకు మూలము
అలమేలుమంగపతియైన శ్రీవేంకటేశుఁడు
కలసె; నన్నిటా చెప్పఁగతలకు మూలము

(||pallavi||)
inniḍigi mūlamu idam̐ḍu nā ramaṇum̐ḍu
kannulāram̐ jĕlulāla kanum̐gŏṁṭiraḍare

(||inni||)
tanivoniyāsalu tamagānagu mūlamu
nanubulu suṭṭarigānagu mūlamu
sĕnaginasĕnagulu siggulagu mūlamu
vinayālu suradabuveḍugagu mūlamu

(||inni||)
kŏsarum̐jūbulĕllānu korigalagu mūlamu
kasarujaṁ kĕlu machchigagu mūlamu
musimusinavvulu muchchaḍalagu mūlamu
pŏsam̐ginasarasālu pŏṁdulagu mūlamu

(||inni||)
talabom̐talu madanadaṁtramulagu mūlamu
lalim̐ dālimulu pŏṁdulagu mūlamu
alamelumaṁgabadiyaina śhrīveṁkaḍeśhum̐ḍu
kalasĕ; nanniḍā sĕppam̐gadalagu mūlamu