Innidi moolamu yeedani roobu

ఇన్నిటి మూలము యీతని రూపు
Language

(॥పల్లవి॥)
ఇన్నిటి మూలము యీతని రూపు
యెన్నఁగ నుపములకు నిరవైనట్లుండె

(॥ఇన్ని॥)
కమలనాభునికిఁ గప్పురకాపు మేన
సముచితముగఁ బైపైఁ జాతినపుడు
అమృతము దచ్చేవేళ అట్టె మనఁ దుంపురులు
తమితోడ నిండుకొని దట్టమైనట్టుండె

(॥ఇన్ని॥)
దైవశిఖామణికి తట్టుపుణుఁగు మేనను
చేవమీర నించి సేవసేసేయపుడు
వేవేలుగా యమునలో వేమారునీఁదులాడఁగా
కావిరి కాళిమ నిండాఁ గప్పినయట్టుండె

(॥ఇన్ని॥)
అలమేలుమంగతోడ నట్టె శ్రీవేంకటపతి
కెలమిసొమ్మువెట్టి యెంచినపుడు
కులికి గొల్లెతలను కూడఁగా గుబ్బలమీఁదఁ
గలపసపెల్లా వచ్చి కమ్ముకన్నట్లుండె

(||pallavi||)
inniḍi mūlamu yīdani rūbu
yĕnnam̐ga nubamulagu niravainaṭluṁḍĕ

(||inni||)
kamalanābhunigim̐ gappuragābu mena
samusidamugam̐ baibaim̐ jādinabuḍu
amṛtamu dachcheveḽa aṭṭĕ manam̐ duṁpurulu
tamidoḍa niṁḍugŏni daṭṭamainaṭṭuṁḍĕ

(||inni||)
daivaśhikhāmaṇigi taṭṭubuṇum̐gu menanu
sevamīra niṁchi sevaseseyabuḍu
vevelugā yamunalo vemārunīm̐dulāḍam̐gā
kāviri kāḽima niṁḍām̐ gappinayaṭṭuṁḍĕ

(||inni||)
alamelumaṁgadoḍa naṭṭĕ śhrīveṁkaḍabadi
kĕlamisŏmmuvĕṭṭi yĕṁchinabuḍu
kuligi gŏllĕdalanu kūḍam̐gā gubbalamīm̐dam̐
galabasabĕllā vachchi kammugannaṭluṁḍĕ