Innidaanu nerubari yemchi sooside needamdu

ఇన్నిటాను నేరుపరి యెంచి చూచితే నీతఁడు
Language

(॥పల్లవి॥)
ఇన్నిటాను నేరుపరి యెంచి చూచితే నీతఁడు
చిన్నదాన నేనే బుద్ది చెప్పఁగదే చెలియా

(॥ఇన్ని॥)
యిచ్చకమే సేసీనంటే యెరపరికమై యుండు
పచ్చిగాఁ జెనకేనంటే పంతమై యుండు
కొచ్చి కొసరేనంటే గొరబుసేసినట్టుండు
ఇచ్చట నీతనిమన సెట్టు గరఁగింతునే

(॥ఇన్ని॥)
మాటలే మాడేనంటే మందెమేళమైనట్టుండు
సాటికిఁ బ(బె?) నఁగే నంటే చలమైయుండు
నీటున నూరకుండితే నిండురాజసమైయుండు
యీటు వెట్టుక యీతని నేరీతిఁ జొక్కింతునే

(॥ఇన్ని॥)
చుట్టమనై మొక్కేనంటే జూటుఁదనమైయుండు
గుట్టున నుండేనంటే సిగ్గులైయుండు
గట్టిగా నన్నేలినాఁడు గక్కనఁ దానే వచ్చి
ఇట్టె శ్రీవేంకట్వేరు నేనిట మెప్పింతునే

(||pallavi||)
inniḍānu nerubari yĕṁchi sūside nīdam̐ḍu
sinnadāna nene buddi sĕppam̐gade sĕliyā

(||inni||)
yichchagame sesīnaṁṭe yĕrabarigamai yuṁḍu
pachchigām̐ jĕnagenaṁṭe paṁtamai yuṁḍu
kŏchchi kŏsarenaṁṭe gŏrabusesinaṭṭuṁḍu
ichchaḍa nīdanimana sĕṭṭu garam̐giṁtune

(||inni||)
māḍale māḍenaṁṭe maṁdĕmeḽamainaṭṭuṁḍu
sāḍigim̐ ba(bĕ?) nam̐ge naṁṭe salamaiyuṁḍu
nīḍuna nūraguṁḍide niṁḍurājasamaiyuṁḍu
yīḍu vĕṭṭuga yīdani nerīdim̐ jŏkkiṁtune

(||inni||)
suṭṭamanai mŏkkenaṁṭe jūḍum̐danamaiyuṁḍu
guṭṭuna nuṁḍenaṁṭe siggulaiyuṁḍu
gaṭṭigā nannelinām̐ḍu gakkanam̐ dāne vachchi
iṭṭĕ śhrīveṁkaṭveru neniḍa mĕppiṁtune