ఇన్నిటాను మేలుమేలు యేల దాఁచేవు
(॥పల్లవి॥)
ఇన్నిటాను మేలుమేలు యేల దాఁచేవు
వన్నెలను తొల్లింటివాఁడవా నీవిపుడు
(॥ఇన్ని॥)
మంతనాన నీతో నాపె మాటలాడెనటకా
చెంతలఁ జెవిలెనేమో చెప్పేనటకా
సంతసాన మరియును సన్న సేసెనటకా
వింతలుగ నన్నియును వింటిమి నీసుద్దులు
(॥ఇన్ని॥)
అంగన తనపై నీకు నానవెట్టెనటకా
సంగతి వలపులెల్లఁజల్లెనటకా
వుంగిటిదీరఁగ సెలవుల నవ్వెనటకా
చెంగటనే వూరెల్లాఁ జెప్పిరి నీసుద్దులు
(॥ఇన్ని॥)
కలికి పై కొని నిన్నుఁ గాఁగిలించె నటకా
యెలమి మాయింటి కప్పణిచ్చె నటకా
కలసితివి శ్రీ వేంకటరమణుఁడు నన్ను
పలుకుఁక బంతములు బలిసె నీసుద్దులు
(||pallavi||)
inniḍānu melumelu yela dām̐sevu
vannĕlanu tŏlliṁṭivām̐ḍavā nīvibuḍu
(||inni||)
maṁtanāna nīdo nābĕ māḍalāḍĕnaḍagā
sĕṁtalam̐ jĕvilĕnemo sĕppenaḍagā
saṁtasāna mariyunu sanna sesĕnaḍagā
viṁtaluga nanniyunu viṁṭimi nīsuddulu
(||inni||)
aṁgana tanabai nīgu nānavĕṭṭĕnaḍagā
saṁgadi valabulĕllam̐jallĕnaḍagā
vuṁgiḍidīram̐ga sĕlavula navvĕnaḍagā
sĕṁgaḍane vūrĕllām̐ jĕppiri nīsuddulu
(||inni||)
kaligi pai kŏni ninnum̐ gām̐giliṁchĕ naḍagā
yĕlami māyiṁṭi kappaṇichchĕ naḍagā
kalasidivi śhrī veṁkaḍaramaṇum̐ḍu nannu
palugum̐ka baṁtamulu balisĕ nīsuddulu