Innidaanu ghanumdainu yeli kidamdu

ఇన్నిటాను ఘనుఁడైను యేలి కితఁడు
Language

(॥పల్లవి॥)
ఇన్నిటాను ఘనుఁడైను యేలి కితఁడు
మన్నించు నీ చేఁతలకు మరిగె నంటాను

(॥ఇన్ని॥)
సిగ్గరితనాల నీవు శిరసు వంచకువే
అగ్గమై యాతఁడు చన్నులంటె నంటాను
బగ్గడితనాల నంత పదరి పలుకకువే
వొగ్గి నీపైఁ దమకించి వొడివట్టె నంటాను

(॥ఇన్ని॥)
మొక్కళితనాల బొమ్మముడి వెట్టుకోకువే
చిక్కించుక నిన్ను గోరఁ జిమ్మె నంటాను
తక్కిరతనాలఁ బంతముల నెరపకువే
మిక్కిలి యాఁతడు నీతో మేలమాడె నంటాను

(॥ఇన్ని॥)
కలికితనాల నంత కడుఁ బెనఁగకువే
చెలఁగి నీ మోవి గంటిసేసె నంటాను
పెలుచుఁదనాన యిఁక బిగియకువే నిన్నేలె
లలి శ్రీవేంకటేశుఁడు లాలించె నంటాను

(||pallavi||)
inniḍānu ghanum̐ḍainu yeli kidam̐ḍu
manniṁchu nī sem̐talagu marigĕ naṁṭānu

(||inni||)
siggaridanāla nīvu śhirasu vaṁchaguve
aggamai yādam̐ḍu sannulaṁṭĕ naṁṭānu
baggaḍidanāla naṁta padari palugaguve
vŏggi nībaim̐ damagiṁchi vŏḍivaṭṭĕ naṁṭānu

(||inni||)
mŏkkaḽidanāla bŏmmamuḍi vĕṭṭugoguve
sikkiṁchuga ninnu goram̐ jimmĕ naṁṭānu
takkiradanālam̐ baṁtamula nĕrabaguve
mikkili yām̐taḍu nīdo melamāḍĕ naṁṭānu

(||inni||)
kaligidanāla naṁta kaḍum̐ bĕnam̐gaguve
sĕlam̐gi nī movi gaṁṭisesĕ naṁṭānu
pĕlusum̐danāna yim̐ka bigiyaguve ninnelĕ
lali śhrīveṁkaḍeśhum̐ḍu lāliṁchĕ naṁṭānu