Innidaam ganumgomtimi imti neebaim gala batti

ఇన్నిటాఁ గనుఁగొంటిమి ఇంతి నీపైఁ గల బత్తి
Language

(॥పల్లవి॥)
ఇన్నిటాఁ గనుఁగొంటిమి ఇంతి నీపైఁ గల బత్తి
వెన్నెల తేటనవ్వుల వెలయించే దెపుడో

(॥ఇన్ని॥)
పొంగఁ బొంగఁ బొంగులాయ పొలఁతి కోరిక లవి
అంగడి బేరాలాయ నడియాసలు
ముంగిటి ముగ్గులాయ మునుకొన్న సిగ్గులు
అంగనను దయఁజూచి యాదరించే దెపుడో

(॥ఇన్ని॥)
చూడఁ జూడఁ బౌఁజులాయ సుదతి కను చూపులు
వొడఁగట్టు దలాలాయ వొడఁబాటులు
వీడెపు బుక్కిళ్లాయ వినుకలి విరహాలు
యీడులేని జవరాలు నేలే దిఁక నెపుడో

(॥ఇన్ని॥)
ఊర నూర నూటులాయ నువిద తమకములు
గోర గీర నేరులాయ కూరిములు
యీరీతి శ్రీవేంకటేశ యీకె నిట్టె కూడితివి
తారుకాణ నీ మాఁటలు తలఁపించే దెపుడో

(||pallavi||)
inniḍām̐ ganum̐gŏṁṭimi iṁti nībaim̐ gala batti
vĕnnĕla teḍanavvula vĕlayiṁche dĕbuḍo

(||inni||)
pŏṁgam̐ bŏṁgam̐ bŏṁgulāya pŏlam̐ti koriga lavi
aṁgaḍi berālāya naḍiyāsalu
muṁgiḍi muggulāya munugŏnna siggulu
aṁgananu dayam̐jūsi yādariṁche dĕbuḍo

(||inni||)
sūḍam̐ jūḍam̐ baum̐julāya sudadi kanu sūbulu
vŏḍam̐gaṭṭu dalālāya vŏḍam̐bāḍulu
vīḍĕbu bukkiḽlāya vinugali virahālu
yīḍuleni javarālu nele dim̐ka nĕbuḍo

(||inni||)
ūra nūra nūḍulāya nuvida tamagamulu
gora gīra nerulāya kūrimulu
yīrīdi śhrīveṁkaḍeśha yīgĕ niṭṭĕ kūḍidivi
tārugāṇa nī mām̐ṭalu talam̐piṁche dĕbuḍo