ఇన్నిటాఁ దగవరివి ఇఁక విన్నవించేదేమి
(॥పల్లవి॥)
ఇన్నిటాఁ దగవరివి ఇఁక విన్నవించేదేమి
సన్నలనే మెలఁగుటే సంగతులు గావా
(॥ఇన్ని॥)
బత్తితోడ నాపె నీకు పాదా లొత్త రాఁగాను
గుత్తపు గుబ్బ లేఁటికి గోరనొత్తేవు
చిత్తగించి ఇంతేసి సిగ్గులు బయటవేసి
హత్తినయాఁటదాని నారడిఁబెట్టుదురా
(॥ఇన్ని॥)
అట్టె వీడెమిచ్చి నీకు నాకు మడిచియ్యఁగాను
చుట్టి మోవిపైఁ బల్లు సోఁకింతురా
మట్టుమీరి చెనకుచు మానము లంగడిఁ బెట్టి
గుట్టుతోడి యాఁటదాని గోరబు సేతురా
(॥ఇన్ని॥)
మచ్చికతో నలుమేలుమంగ నీతోనవ్వఁగాను
తచ్చి శ్రీవేంకటేశుఁడ తమిరేఁచేవు
మచ్చు వేసి యింతలోనె మనసెల్లాఁ గరఁగించి
ముచ్చటైనయాఁటాదాని ముంగిటఁ బెట్టుదురా
(||pallavi||)
inniḍām̐ dagavarivi im̐ka vinnaviṁchedemi
sannalane mĕlam̐guḍe saṁgadulu gāvā
(||inni||)
battidoḍa nābĕ nīgu pādā lŏtta rām̐gānu
guttabu gubba lem̐ṭigi goranŏttevu
sittagiṁchi iṁtesi siggulu bayaḍavesi
hattinayām̐ṭadāni nāraḍim̐bĕṭṭudurā
(||inni||)
aṭṭĕ vīḍĕmichchi nīgu nāgu maḍisiyyam̐gānu
suṭṭi movibaim̐ ballu som̐kiṁturā
maṭṭumīri sĕnagusu mānamu laṁgaḍim̐ bĕṭṭi
guṭṭudoḍi yām̐ṭadāni gorabu sedurā
(||inni||)
machchigado nalumelumaṁga nīdonavvam̐gānu
tachchi śhrīveṁkaḍeśhum̐ḍa tamirem̐sevu
machchu vesi yiṁtalonĕ manasĕllām̐ garam̐giṁchi
muchchaḍainayām̐ṭādāni muṁgiḍam̐ bĕṭṭudurā