Innidaam daa nerubari yillaala nenu

ఇన్నిటాఁ దా నేరుపరి యిల్లాల నేను
Language

(॥పల్లవి॥)
ఇన్నిటాఁ దా నేరుపరి యిల్లాల నేను
చిన్నదానఁ బ్రియమెంత చెప్పీనే తాను

(॥ఇన్ని॥)
వొడఁబరచినమాఁట లూఁకొంటిఁగదవే
నడుమఁ దా నేమనినా నవ్వితిఁగదె
అడియాలాలు చెప్పితే నౌఁగాదనఁగదవె
తడవి నన్నేమిటికిఁ దగిలీనె తాను

(॥ఇన్ని॥)
చలపట్టి వేఁడుకొంటే సమ్మతించితిఁగదవె
సొలసితే తనమోము చూచితిఁగదె
అలరి విడెమిచ్చితే నందుకొంటిఁ గదవె
కొలఁది మీర నన్నెంత కొసరీనే తాను

(॥ఇన్ని॥)
పాదములు చాఁచితేను పట్టి వొత్తితిఁ గదవే
మోదమున మెచ్చితేను మొక్కితేఁగదే
యీదెస శ్రీవేంకటేశఁ డింతలోనే నన్నుఁ గూడె
పోదిసేసి నన్నేల పోదిగీనే తాను

(||pallavi||)
inniḍām̐ dā nerubari yillāla nenu
sinnadānam̐ briyamĕṁta sĕppīne tānu

(||inni||)
vŏḍam̐barasinamām̐ṭa lūm̐kŏṁṭim̐gadave
naḍumam̐ dā nemaninā navvidim̐gadĕ
aḍiyālālu sĕppide naum̐gādanam̐gadavĕ
taḍavi nannemiḍigim̐ dagilīnĕ tānu

(||inni||)
salabaṭṭi vem̐ḍugŏṁṭe sammadiṁchidim̐gadavĕ
sŏlaside tanamomu sūsidim̐gadĕ
alari viḍĕmichchide naṁdugŏṁṭim̐ gadavĕ
kŏlam̐di mīra nannĕṁta kŏsarīne tānu

(||inni||)
pādamulu sām̐sidenu paṭṭi vŏttidim̐ gadave
modamuna mĕchchidenu mŏkkidem̐gade
yīdĕsa śhrīveṁkaḍeśham̐ ḍiṁtalone nannum̐ gūḍĕ
podisesi nannela podigīne tānu