ఇన్నిటాఁ దా నాయకుఁడు ఇల్లాలి నేను
(॥పల్లవి॥)
ఇన్నిటాఁ దా నాయకుఁడు ఇల్లాలి నేను
కన్నులఁ జూడఁ జూడఁగా గనమే వేడుకలు
(॥॥)
వొప్పుగా నన్ను మన్నించే దొక్కటే గుఱుతు గాక
చెప్పితే నా విన్నపాలు శేనాశేన
అప్పుడు దాఁ జే పట్టిన దదియే యెన్నికగాక
చొప్పుగా నే నాసపడఁ జో టెంతైనాఁ గలదు
(॥॥)
వసమై తా నాయింటికి వచ్చుటే యెక్కుడు గాక
కొరే నంటేఁ జేఁతలు కోటానఁ గోటి
యెసగి తా నాతో నవ్వే దిదే సంతోసము గాక
పొసఁగె నా తమకము పూట పూట కెక్కుడు
(॥॥)
కలిసి వుండేటి తన కౌఁగిలే సతము గాక
వెలసి నా సిగ్గులైతే వేయి వేలు
యిలఁ దా శ్రీ వేంకటేశుఁడే నలమేలుమంగను
వలెనని నన్నేలఁగాఁ జెలిమి యీడేరెను
(||pallavi||)
inniḍām̐ dā nāyagum̐ḍu illāli nenu
kannulam̐ jūḍam̐ jūḍam̐gā ganame veḍugalu
(||||)
vŏppugā nannu manniṁche dŏkkaḍe guṟudu gāga
sĕppide nā vinnabālu śhenāśhena
appuḍu dām̐ je paṭṭina dadiye yĕnnigagāga
sŏppugā ne nāsabaḍam̐ jo ṭĕṁtainām̐ galadu
(||||)
vasamai tā nāyiṁṭigi vachchuḍe yĕkkuḍu gāga
kŏre naṁṭem̐ jem̐talu koḍānam̐ goḍi
yĕsagi tā nādo navve dide saṁtosamu gāga
pŏsam̐gĕ nā tamagamu pūḍa pūḍa kĕkkuḍu
(||||)
kalisi vuṁḍeḍi tana kaum̐gile sadamu gāga
vĕlasi nā siggulaide veyi velu
yilam̐ dā śhrī veṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
valĕnani nannelam̐gām̐ jĕlimi yīḍerĕnu