Innidaa vedugagaamdu yemi sesinaam jellunu

ఇన్నిటా వేడుకకాఁడు యేమి సేసినాఁ జెల్లును
Language

(॥పల్లవి॥)
ఇన్నిటా వేడుకకాఁడు యేమి సేసినాఁ జెల్లును
యెన్నికాయ దన సుద్దులేల సిగ్గువడీనే

(॥ఇన్ని॥)
కూరిమితోఁ జూతుఁగాని కోపగించఁజాలనే
గారవింతుఁగాని యలుగఁగఁగాని
సారెఁ బొందుసేతుఁగాని జంకించఁజాలనే
యీరీతి నా గుణ మిదియేల సిగ్గువడీనే

(॥ఇన్ని॥)
మంచిమాఁ టాడుదుఁగాని మరి వెంగే లాడెనే
కొంచక నవ్వుదుఁగాని గుంపించఁజాలనే
వంచించి మొక్కుదుఁగాని వడి నొడ్డారించనే
యెంచితే నా కత లివి యేల సిగ్గువడీనే

(॥ఇన్ని॥)
చుట్టమనై వుందుఁగాని సూడుఁబాడు బట్టనే
మెట్టి సేవసేతుఁగాని మేర మీరనే
పట్ట పలమేలు మంగపతి శ్రీవేంకటేశుఁడు
యిట్టె నన్నేలినాఁడు యేల సిగ్గువడీనే

(||pallavi||)
inniḍā veḍugagām̐ḍu yemi sesinām̐ jĕllunu
yĕnnigāya dana suddulela sigguvaḍīne

(||inni||)
kūrimidom̐ jūdum̐gāni kobagiṁcham̐jālane
gāraviṁtum̐gāni yalugam̐gam̐gāni
sārĕm̐ bŏṁdusedum̐gāni jaṁkiṁcham̐jālane
yīrīdi nā guṇa midiyela sigguvaḍīne

(||inni||)
maṁchimām̐ ṭāḍudum̐gāni mari vĕṁge lāḍĕne
kŏṁchaga navvudum̐gāni guṁpiṁcham̐jālane
vaṁchiṁchi mŏkkudum̐gāni vaḍi nŏḍḍāriṁchane
yĕṁchide nā kada livi yela sigguvaḍīne

(||inni||)
suṭṭamanai vuṁdum̐gāni sūḍum̐bāḍu baṭṭane
mĕṭṭi sevasedum̐gāni mera mīrane
paṭṭa palamelu maṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍu
yiṭṭĕ nannelinām̐ḍu yela sigguvaḍīne