ఇన్నిటా సంతోసమాయ నిటు మిమ్మిద్దరిఁ జూచి
(॥పల్లవి॥)
ఇన్నిటా సంతోసమాయ నిటు మిమ్మిద్దరిఁ జూచి
మన్నించిన మన్ననలే మంతుకెక్కె నిపుడు
(॥ఇన్ని॥)
కలువ లెవ్వరిఁ గాఁడీ కంతుఁడెక్కడ నేసీ
నెలఁతను నీవు గరుణించితేఁ జాలు
చలువలే వేఁడియౌనా సతులకుఁ బతులకు
వలచినవలపులే వడిగొనీఁగక
(॥ఇన్ని॥)
చందురుఁ డెవ్వరు నేఁచీ చల్లగాలేమి సాదించీ
ఇందువదనను నీవేలితేఁ జాలు
గందము మొగజాటౌనా కాయములఁ బూసితేను
పొందు సేసినపొందులే పోదిసేసీఁ గాక
(॥ఇన్ని॥)
తుమ్మిదల కేడపగ దూరనేల చిలుకల
కొమ్మా నీవూ నిట్లానే కూడితేఁ జాలు
యిమ్ముల శ్రీవేంకటేశ యిచ్చక మెరవులౌనా
నెమ్మిఁ గోరినకోరిక నెట్టుకొనీఁగాక
(||pallavi||)
inniḍā saṁtosamāya niḍu mimmiddarim̐ jūsi
manniṁchina mannanale maṁtugĕkkĕ nibuḍu
(||inni||)
kaluva lĕvvarim̐ gām̐ḍī kaṁtum̐ḍĕkkaḍa nesī
nĕlam̐tanu nīvu garuṇiṁchidem̐ jālu
saluvale vem̐ḍiyaunā sadulagum̐ badulagu
valasinavalabule vaḍigŏnīm̐gaga
(||inni||)
saṁdurum̐ ḍĕvvaru nem̐sī sallagālemi sādiṁchī
iṁduvadananu nīvelidem̐ jālu
gaṁdamu mŏgajāḍaunā kāyamulam̐ būsidenu
pŏṁdu sesinabŏṁdule podisesīm̐ gāga
(||inni||)
tummidala keḍabaga dūranela silugala
kŏmmā nīvū niṭlāne kūḍidem̐ jālu
yimmula śhrīveṁkaḍeśha yichchaga mĕravulaunā
nĕmmim̐ gorinagoriga nĕṭṭugŏnīm̐gāga