Innidaa rattadivaudu veṟumgudu nee jaadalu

ఇన్నిటా రట్టడివౌదు వెఱుఁగుదు నీ జాడలు
Language

(॥పల్లవి॥)
ఇన్నిటా రట్టడివౌదు వెఱుఁగుదు నీ జాడలు
మన్ననలు చేకొంటివి మచ్చికలు చల్లవే

(॥ఇన్ని॥)
పంతా లాడవద్దుగాని పడఁతి విభునితోడ
చెంతనుండి విన్నపాలు సేసుకొనవే
వింతసేయవద్దుగాని వేడుకతో విడెమిచ్చి
సంతోసాలు రేఁచి మోవి చవిచూపవే

(॥ఇన్ని॥)
గబ్బితనా లొద్దుగాని కదిసి వినయముతో
వుబ్బురేఁ చూరక పాదాలొత్తఁగదవే
సిబ్బితింత వొద్దుగని చెలరేఁగి పొందుచూసి
గుబ్బలనొత్తి వలపు గుమ్మరించవే

(॥ఇన్ని॥)
గయ్యాళించవొద్దుగాని కాఁగిట శ్రీవేంకటేశు -
నియ్యెడఁ బొదిగి కడునింపులు చూపవే
కొయ్యతనా లొద్దుగాని కూడె నిన్నితఁడు నేఁడె
వొయ్యనొయ్యనే నేరువు లొనరించవే

(||pallavi||)
inniḍā raṭṭaḍivaudu vĕṟum̐gudu nī jāḍalu
mannanalu segŏṁṭivi machchigalu sallave

(||inni||)
paṁtā lāḍavaddugāni paḍam̐ti vibhunidoḍa
sĕṁtanuṁḍi vinnabālu sesugŏnave
viṁtaseyavaddugāni veḍugado viḍĕmichchi
saṁtosālu rem̐si movi savisūbave

(||inni||)
gabbidanā lŏddugāni kadisi vinayamudo
vubburem̐ sūraga pādālŏttam̐gadave
sibbidiṁta vŏddugani sĕlarem̐gi pŏṁdusūsi
gubbalanŏtti valabu gummariṁchave

(||inni||)
gayyāḽiṁchavŏddugāni kām̐giḍa śhrīveṁkaḍeśhu -
niyyĕḍam̐ bŏdigi kaḍuniṁpulu sūbave
kŏyyadanā lŏddugāni kūḍĕ ninnidam̐ḍu nem̐ḍĕ
vŏyyanŏyyane neruvu lŏnariṁchave