Innidaa nerubarivi yideṟumga vayidivi

ఇన్నిటా నేరుపరివి యిదెఱుఁగ వయితివి
Language

(॥పల్లవి॥)
ఇన్నిటా నేరుపరివి యిదెఱుఁగ వయితివి
విన్నవారెల్లా నవ్వేరు విడువ నీ మాటా

(॥ఇన్ని॥)
దగ్గరి వచ్చినదే తప్పు సేసి నీవు నాతో
కగ్గి కాలు దాఁకె నంటా గడియించేవు
యెగ్గనక ఆడుకొనే విదొక పెద్దరికమా
సిగ్గువడ కిందరిలో చీచీ యీ మాటా

(॥ఇన్ని॥)
అట్టె నీతో మాటాడినదే యపరాధముగాఁ జేసి
తిట్టితినంటా నానలు తెగి పెట్టేవు
గుట్టున నుండక నలుగురి సాకిరి వెట్టేవు
అట్టె అణఁచుకోవైతి వయ్యో యీమాట

(॥ఇన్ని॥)
నెమ్మది నవ్వినదే నెపము చేసినా
తమ్మ మీఁదఁ బడె నంటాఁ దమకించేవు
యిమ్ముల శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
యెమ్మెల పంతము లాడే వేలరా యీ మాటా

(||pallavi||)
inniḍā nerubarivi yidĕṟum̐ga vayidivi
vinnavārĕllā navveru viḍuva nī māḍā

(||inni||)
daggari vachchinade tappu sesi nīvu nādo
kaggi kālu dām̐kĕ naṁṭā gaḍiyiṁchevu
yĕgganaga āḍugŏne vidŏga pĕddarigamā
sigguvaḍa kiṁdarilo sīsī yī māḍā

(||inni||)
aṭṭĕ nīdo māḍāḍinade yabarādhamugām̐ jesi
tiṭṭidinaṁṭā nānalu tĕgi pĕṭṭevu
guṭṭuna nuṁḍaga naluguri sāgiri vĕṭṭevu
aṭṭĕ aṇam̐sugovaidi vayyo yīmāḍa

(||inni||)
nĕmmadi navvinade nĕbamu sesinā
tamma mīm̐dam̐ baḍĕ naṁṭām̐ damagiṁchevu
yimmula śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
yĕmmĕla paṁtamu lāḍe velarā yī māḍā