Innidaa nerbari daani kide buddi

ఇన్నిటా నేర్పరి దాని కిదే బుద్ది
Language

(॥పల్లవి॥)
ఇన్నిటా నేర్పరి దాని కిదే బుద్ది
సన్నెఱిఁగి మెలఁగితే చవులౌను పొందులు

(॥ఇన్ని॥)
యేలినవానితో సతి యెంత చనవరియైనా
వేళెరిఁగి మాటాడితే వేడుకలౌను
వీలుచు నొక్కొకవేళ వేసరుకొంటేఁ దాను
తాలిమితో నుండితేనే దయవుట్టును

(॥ఇన్ని॥)
కలసినయడాటానఁ గడుఁజక్కనిదైనాను
తల పెరిఁగి నవ్వితేఁ దమిరేఁగును
అలిఁగినసమయాన నాతఁడే మన్నించి
పిలిచినఁ బలికితే ప్రియము గలుగును

(॥ఇన్ని॥)
శ్రీవేంకటేశు తోడ జిగి నలమేల్ మంగవు
నీవైన నిచ్చకమైతే నిల్చుఁ గాంక్షలు
అవటించి సమరతి నాతఁ డలయించితేను
కైవశమై కలసితే కరఁగును మనసు

(||pallavi||)
inniḍā nerbari dāni kide buddi
sannĕṟim̐gi mĕlam̐gide savulaunu pŏṁdulu

(||inni||)
yelinavānido sadi yĕṁta sanavariyainā
veḽĕrim̐gi māḍāḍide veḍugalaunu
vīlusu nŏkkŏgaveḽa vesarugŏṁṭem̐ dānu
tālimido nuṁḍidene dayavuṭṭunu

(||inni||)
kalasinayaḍāḍānam̐ gaḍum̐jakkanidainānu
tala pĕrim̐gi navvidem̐ damirem̐gunu
alim̐ginasamayāna nādam̐ḍe manniṁchi
pilisinam̐ baligide priyamu galugunu

(||inni||)
śhrīveṁkaḍeśhu toḍa jigi nalamel maṁgavu
nīvaina nichchagamaide nilsum̐ gāṁkṣhalu
avaḍiṁchi samaradi nādam̐ ḍalayiṁchidenu
kaivaśhamai kalaside karam̐gunu manasu